Breaking News

యోగి ఆదిత్యనాథ్‌పై బయోపిక్‌.. విడుదలకు అడ్డుగా సెన్సార్‌ బోర్డ్‌

Published on Fri, 08/01/2025 - 10:27

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'అజయ్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ఎ యోగి'.. దర్వకుడు రవీంద్ర గౌతమ్‌ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అడ్డుచెప్పింది. దీంతో చిత్ర యూనిట్‌  బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సర్టిఫికేషన్ దరఖాస్తులను తిరస్కరించడాన్ని సెన్సార్‌ను తప్పుబడుతూ వారు కోర్టులో సవాలు చేశారు.

'అజయ్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ఎ యోగి' చిత్రంలో యోగి ఆదిత్యనాథ్‌ పాత్రలో అనంత్‌ జోషి నటించారు. ఆయన గురువు మహంత్ పాత్రలో పరేష్‌ రావల్‌ నటించారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెన్సార్‌ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో చిత్ర నిర్మాతలు ముంబై కోర్టును ఆశ్రయించి తమ వాదనను వినిపించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర నిర్మాతలు కోర్టుకు తెలిపారు. దీంతో ఇదే విధంగానే న్యాయస్థానం కూడా సెన్సార్‌ బోర్డును ప్రశ్నించింది. 

పుస్తకంపై ఎలాంటి సమస్యలు లేనప్పుడు సినిమాకు అభ్యంతరాలు ఎందుకని న్యాయమూర్తులు రేవతి మోహితే డెరే, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం సెన్సార్‌ బోర్డును ప్రశ్నించింది. పుస్తకం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది సినిమా విడుదలకు ఎందుకు వస్తుందని న్యాయస్థానం నిలదీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని CBFCకి కోర్టు నోటీసు జారీ చేసింది.

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)