Breaking News

రైల్వేలో ఇంటర్న్‌షిప్‌ చేశా.. జాబ్‌ కాదనుకుని యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి!

Published on Thu, 04/25/2024 - 17:22

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాను.. ఇంజనీర్‌ అవబోయి ఇలా సినిమాల్లో వచ్చి పడ్డాను.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. కొందరైతే సినిమాల మీద ప్రేమతో ఉన్న ఉద్యోగాలు వదిలేసి మరీ సినీ ఇండస్ట్రీలో వాలిపోయారు. అలా బుల్లితెర నటి మైరా ధాత్రి మెహ్రా కూడా నటి కాకముందు ఇండియన్‌ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసిందట.

జాబ్‌ ఆఫర్‌ వదిలేశా
ఆమె మాట్లాడుతూ.. 'నాకు చదువంటే ఇష్టం. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక రైల్వేలో ఇంటర్న్‌షిప్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. ఆ అవకాశం ఎలా వచ్చిందో తెలీదు కానీ ఎలాగోలా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశాను. ఆ సమయంలోనే.. రోజూ ఎనిమిది గంటల డ్యూటీ చేయడం నా వల్ల కాదని తెలుసుకున్నాను. అందుకే జాబ్‌ ఆఫర్‌ వచ్చినా వదిలేసుకున్నాను. నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. ఇందుకోసం అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్టూడియోలో నెలపాటు శిక్షణ తీసుకున్నాను.

కాలేజీకి వెళ్తూనే..
పార్ట్‌ టైం కోర్సు కూడా పూర్తి చేశాను. ఓపక్క ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కోచింగ్‌ తీసుకుంటూ ఆ తర్వాత కాలేజీకి వెళ్లేదాన్ని. ఇందుకోసం ఎక్కువ జర్నీ చేయాల్సి వచ్చేది. మా అమ్మకు కూడా ఈ విషయం చెప్పలేదు. అనుపమ్‌ సర్‌ అప్పట్లో కాస్టింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ సమయంలో కుంకుమ భాగ్య సీరియల్‌కు నా పేరు సూచించాడు. అలా ఫస్ట్‌ టైమ్‌ ఆ సీరియల్‌లో నటించాను.

అప్పుడలా.. తర్వాతిలా..
నిజానికి రైల్వే ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నప్పుడు సాయంత్రం ఐదు ఎప్పుడవుతుందా? అని ఎదురుచూసేదాన్ని. యాక్టింగ్‌ ఇండస్ట్రీలో వరుసగా 12 నుంచి 13 గంటల దాకా పని చేస్తాం. కానీ ఎన్నడూ బోర్‌గా ఫీలవలేదు, టైం ఎప్పుడు అయిపోతుందా? అని గడియారం వంక చూసుకోలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా 'కుంకుమ భాగ్య'తో పాటు 'సాసురాల్‌ జెండా ఫూల్‌ 2', 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' వంటి సీరియల్స్‌లో మెరిసిన మైరా ధాత్రి చివరగా 'దాల్చిని' సీరియల్‌లో నటించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)