భార్యకు విడాకులు.. దుబాయ్‌కు వెళ్లిందంటే అమ్మాయి చెడిపోయినట్లేనా?

Published on Wed, 06/25/2025 - 19:24

సినీ నటుడు రఫీ- మహిన మున్నా విడిపోయారు. పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు మహిన ప్రకటించింది. దయచేసి అందుకు గల కారణాలు అడగవద్దని కోరింది. అలాగే తనపై వస్తున్న ఆరోపణలపైనా స్పందించింది. మహిన మాట్లాడుతూ.. నేను, రఫీ కలిసున్నామా? లేదా? అన్నది చాలామంది ప్రశ్న. లేదు, మేమిద్దరం విడిపోయాం. ఎందుకు? ఏమిటి? అనేది ఎవరూ అడగకండి. మా గురించి పేరెంట్స్‌ను, బంధువులను అడిగి వారిని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను.

దుబాయ్‌కు వెళ్తే అంతేనా?
నా జీవితంలో ఏం జరిగిందో నేను చెప్పాలనుకోవడం లేదు. మీరు అడగడం కూడా కరెక్ట్‌ కాదు. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు. దుబాయ్‌కు వెళ్లాకే మహినా మారిపోయింది, రఫీని వదిలించుకుంది అని చెత్త కామెంట్లు చేస్తున్నారు. అవి నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దుబాయ్‌కు వెళ్తున్న అమ్మాయిలందరూ చెడ్డవారేనా? నేను నా కెరీర్‌ కోసం ఇక్కడికి వచ్చాను. నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నాను. నా పేరెంట్స్‌ బాగోగులు నేనే చూసుకోవాలనుకున్నాను. దుబాయ్‌కు రాగానే అమ్మాయిలు మారిపోతారు, చెడిపోతారనే మాటల్లో ఏమాత్రం నిజం లేదు.

నేనేంటో మీకేం తెలుసు?
నేనే కాదు, 95% మంది ఇక్కడికి పనికోసమే వస్తారు. ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యంగా పని చేస్తారు. నేను కూడా అలా స్వశక్తితో ఎదగాలని వచ్చాను. నా గురించి పనికిరాని కామెంట్లు చేసేవారికి నేనేంటో తెలీదు. నా గురించి తెలిస్తే అలా ఏది పడితే అది వాగరు. రఫీని మోసం చేశానని అనేవాళ్లూ ఉన్నారు. అమ్మాయిలే మోసం చేస్తారా? అబ్బాయిలు కూడా మోసం చేస్తారు. 100% మంచివాళ్లంటూ ఎవరూ ఉండరు.

విడిపోవడమే మంచిదని..
మేము కలిసుండటానికి ఎంతగానో ప్రయత్నించాం. అదిక జరగదని అర్థమయ్యాకే విడిపోయాం. దీని గురించి పదేపదే అడిగి అతడి పేరెంట్స్‌ను కూడా ఇబ్బంది పెట్టకండి. కలిసికట్టుగా ఉంటేనే జీవితం ముందుకు సాగుతుందని నాకూ తెలుసు. కానీ సఖ్యత చెడిపోయినప్పుడు ఆ బంధాన్ని అలాగే కొనసాగించేబదులు విడిపోవడమే మంచిది. మేము చేసిందదే! మా కారణాలు మాకున్నాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మేము కలిసున్నప్పుడు సంతోషాన్నే మీకు చూపించాం. కొందరు వారి కష్టాలు, బాధలు, పోట్లాటలు అన్నీ కూడా వీడియోలు చేసి చెప్తుంటారు. అలా చేయడం నాకిష్టం ఉండదు.

ఫేమ్‌ చూసి పెళ్లి?
రఫీకి ఉన్న పాపులారిటీ వల్లే నేనిక్కడిదాకా వచ్చానంటున్నారు. ఆయన ఫేమ్‌ చూసి నేను పెళ్లి చేసుకోలేదు. ఫేమ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా కెరీర్‌ కోసం విడిపోయాం అని చెప్పుకొచ్చింది. రఫీ, మహినా.. 2022లో పెళ్లి చేసుకున్నారు. రఫీ.. చక్కపాలెం సీరియల్‌తో పాపులర్‌ అయ్యాడు. కనిమంగళం కోవిలగం అనే వెబ్‌ సిరీస్‌ చేశాడు. ప్రస్తుతం సుమతి వలవు మూవీ చేస్తున్నాడు.

చదవండి: ఇండస్ట్రీలో డ్రగ్స్‌ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటకొస్తాయ్‌

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)