Breaking News

టాలీవుడ్‌లో హీరోయిన్‌కు చేదు అనుభవం.. స్టార్‌ హీరో సినిమాలో..

Published on Mon, 11/27/2023 - 09:54

ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలిగే హీరోయిన్‌ మహిమ నంబియార్‌. 12వ తరగతి చదువుతుండగానే కథానాయికగా రంగప్రవేశం చేసిందీ మాలీవుడ్‌ చిన్నది. సాట్టై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన మహిమా నంబియార్‌ ఆ తరువాత ఇక్కడ పలు చిత్రాలలో నటించి గుర్తింపు పొందింది. ఇటీవల ఈమె నటించిన చంద్రముఖి–2, రత్తం చిత్రాలు ఒకే రోజు విడుదల అవడం విశేషం. రత్తం చిత్రంలో విలనిజాన్ని ప్రదర్శించిన ఈమె చంద్రముఖి–2లో రాఘవ లారెన్స్‌కు జంటగా నటించింది.

హీరోయిన్ల సమస్యలపై ఏమందంటే?
ప్రస్తుతం పలు చిత్రాలతో ముఖ్యంగా మలయాళంలో ప్రముఖ నటుల సరసన నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా మహిమా నంబియార్‌.. హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ.. చిత్ర పరిశ్రమలో కథానాయికలు చాలా కాలంగా ఇబ్బందిపడుతున్నారంది. చాలా మంది నటీమణులు తమకు ఎదురయ్యే అరాచకాలపై పోరాడుతున్నా ఫలితం ఉండటం లేదని పేర్కొంది. ఎక్కడి వరకో ఎందుకు? తాను కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పింది.

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా..
ఇంతకు ముందు తెలుగులో ఒక ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో నాలుగు రోజులు నటించానని, ఆ తరువాత కొంచెం గ్యాప్‌ తీసుకుని షూటింగ్‌ చేద్దామని చిత్ర వర్గాలు చెప్పారంది. అలా కొన్ని రోజుల తరువాత ఆ చిత్ర మేనేజర్‌ తనకు ఫోన్‌ చేసి తమ చిత్రంలో ఒక పెద్ద హీరోయిన్‌ నటించడానికి సమ్మతించారని, అందువలన నన్ను తొలగించినట్లు చెప్పారని పేర్కొంది. ఇలాంటి అవమానాలను చాలా ఎదుర్కొన్నట్టు నటి మహిమ నంబియార్‌ చెప్పింది.

చదవండి: ఒకే వేదికపై మహేశ్‌-రాజమౌళి.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్