Breaking News

మరో వివాదంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా?

Published on Fri, 01/05/2024 - 13:10

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా మరో వివాదంలో చిక్కుకునేలా కనిపిస్తుంది. అవును మీరు సరిగానే విన్నారు. ఈ మూవీ కథని ఓ నవల నుంచి కాపీ కొట్టారనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో విడుదలకు ముందే మరోసారి ఈ మూవీ చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? 'గుంటూరు కారం' రిలీజ్ సంగతేంటి?

మహేశ్-త్రివిక్రమ్ అంటే బెస్ట్ కాంబో అని చెప్పొచ్చు. వీళ్లిద్దరూ కలిసి చేసిన 'అతడు', 'ఖలేజా'.. థియేటర్లలో సరిగా ఆడలేదు కానీ ఆ తర్వాత మాత్రం కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. అలా ఇప్పుడు 'గుంటూరు కారం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే రెండేళ్ల క్రితమే ఈ సినిమా మొదలైనప్పటికీ.. హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, ఫైట్ మాస్టర్స్, పాటలపై.. ఇలా చాలా మార్పులతో ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధమైంది.

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న 'గుంటూరు కారం' సెన్సార్.. తాజాగా పూర్తయింది. సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని అన్నారు. అదే టైంలో ఈ చిత్రానికి.. యద్దనపూడి సులోచనరాణి 'కీర్తి కిరీటాలు' అనే నవలకు దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది థియేటర్లలోకి మూవీ వస్తే గానీ తెలియదు. 

ఇకపోతే గతంలోనూ త్రివిక్రమ్ సినిమాలపై ఇలా కాపీ కామెంట్స్ వినిపించాయి. 'అఆ' సినిమాని కూడా యద్దనపూడి 'మీనా' నవల ఆధారంగా తీశారని అన్నారు. ఆ వివాదం ఆ తర్వాత సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మహేశ్ సినిమాకు 'కీర్తి కిరీటాలు' నవలకు సంబంధం ఉందని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం రిలీజ్ తర్వాత వివాదం లాంటిది ఏమైనా జరగొచ్చు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే 'గుంటూరు కారం' రిలీజ్ కావాల్సిందే.

(ఇదీ చదవండి: గురూజీ త్రివిక్రమ్ ఏదైనా చేయగల సమర్థుడు: హీరోయిన్‌ పూనమ్ కౌర్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)