Breaking News

కన్నీళ్లు పెట్టించే సినిమా.. రియల్‌ లైఫ్‌లో అంతకంటే దారుణం!

Published on Wed, 02/07/2024 - 15:28

ఒక్కగానొక్క కొడుకు.. అతడి మీదే ఆధారపడుతున్న తల్లిదండ్రులు.. న్యూయార్క్‌లో జీవిస్తున్న ఆ కుమారుడిపై ముష్కరులు దాడి చేసి చంపేస్తారు. ఈ విషయం తెలిసి ఆ వృద్ధ దంపతులు కుప్పకూలిపోతారు. అద్దె ఇంటికి మారతారు. కొడుకు అస్థికల కోసం నెలల తరబడి ఎదురుచూస్తారు. చివరకు అతడి అస్థికలు, తను వాడిన వస్తువులు అన్నీ ఇండియాకు వస్తాయి. కానీ అవి ఇవ్వాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందేనన్నారు అధికారులు.

వృద్ధాప్యంలో ఉన్న తాము ఎక్కడి నుంచి డబ్బులు తేగలమని ప్రశ్నించాడా తండ్రి. వస్తువులు ఉంచేసుకోండి, కనీసం అస్థికలైనా ఇవ్వమని అర్థించాడు. అవమానించారు. చివరకు కస్టమ్స్‌ ఆఫీసు ప్రధాన అధికారిని కలిసి మొరపెట్టుకున్నాడు, కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పుడు కానీ ఆ కొడుకు అస్థికలు, వస్తువులు తన చేతికి రాలేదు.. ఇది 1984లో వచ్చిన హిందీ మూవీ సారాంశ్‌ సినిమా కథ!

ఆఫీసర్లకు లంచం
ఇలాంటి ఘటనలు రీల్‌ లైఫ్‌లో కన్నా రియల్‌ లైఫ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సారాంశ్‌ సినిమా వచ్చి 40 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహేశ్‌ భట్‌ ఓ నిజ సంఘటనను చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'సింగర్‌ జగజీత్‌ సింగ్‌ కుమారుడు ఓ యాక్సిడెంట్‌లో మరణించాడు. అప్పుడతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి జూనియర్‌ ఆఫీసర్లకు లంచం ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. సారాంశ్‌ సినిమా ప్రాముఖ్యత అప్పుడర్థమైందన్నాడు. చాలాచోట్ల తమ సొంత కుటుంబీకుల మృతదేహాలను చూసేందుకు, ఇంటికి తీసువెళ్లేందుకు సాధారణ ప్రజలు ఎంతగానో ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చాడు.


జగజీత్‌ సింగ్‌

20 ఏళ్లకే మరణం
కాగా జగజీత్‌ సింగ్‌- చిత్రల ఏకైక తనయుడు వివేక్‌ 1990లో కారు ప్రమాదంలో మరణించాడు. అప్పుడతడి వయసు 20 ఏళ్లు మాత్రమే! తనయుడి మరణం వారిని ఎంతగానో కుంగదీసింది. కొంతకాలానికి ఇద్దరూ సంగీతపరిశ్రమకు దూరమయ్యారు. సారాంశ్‌ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మహేశ్‌ భట్‌ తెరకెక్కించాడు. అనుపమ్‌ ఖేర్‌ ఈ మూవీ ద్వారా నటుడిగా పరిచయమయ్యాడు. అప్పుడతడి వయసు 28 ఏళ్లు. అయినప్పటికీ పాత్ర నచ్చడంతో 60 ఏళ్ల వృద్ధుడిగా నటించాడు.

చదవండి:  ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలే.. నా జీవితంలో..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)