Breaking News

Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ

Published on Fri, 12/20/2024 - 11:17

మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్‌ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి. 

ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం.  ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.

ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్‌కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్‌కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది. 

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది. 

వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్‌ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.
-‍ హరికృష్ణ ఇంటూరు

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)