Breaking News

‘వారణాసి’ చూసి యావత్‌ దేశం గర్వపడుతుంది: మహేశ్‌ బాబు

Published on Sat, 11/15/2025 - 23:15

నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’.

 ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ పాత్ర పోషించాడు.  గ్లోబ్‌ ట్రాటర్‌ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో శనివారం ఈ మూవీ టైటిల్‌తో పాటు స్పెషల్‌ వీడియోని రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్‌ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. 

ఈ ఈవెంట్‌ కేవలం టైటిల్‌ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్‌) సపోర్ట్‌ ఎప్పుడూ ఇలానే  ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్‌ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్‌ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)