మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
‘ది బ్లఫ్’పై మహేశ్ బాబు ట్వీట్.. రిప్లైలో ‘వారణాసి’ అప్‌డేట్ ఇచ్చిన ప్రియాంక!
Published on Mon, 03/02/2026 - 11:35
ప్రియాంక చోప్రా నటించిన తాజా హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై, మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఇప్పటికే రాజమౌళితో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా ఈస ఇనిమాపై రివ్యూ ఇచ్చాడు.
‘‘ది బ్లఫ్.. యాక్షన్, ఎమోషన్స్‌కు అన్నీ ఉన్న సినిమా. ప్రియాంక యాక్టింగ్ అదిరిపోయింది. అన్ని సన్నివేశాల్లో బాగా నటించింది. ఈ చిత్రంలో భాగమైన వారందరికీ నా అభినందనలు’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కి ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చింది.
దీనికి ప్రియాంక స్పందిస్తూ పెట్టిన రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది. ‘థాంక్యూ మై ఫ్రెండ్.. .. త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం’ అని ఆమె కామెంట్ చేసింది. దీంతో ‘వారణాసి’ తర్వాత షెడ్యూల్ అక్కడ జరగనుందని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మందాకిని అనే పాత్రని ప్రియాంక పోషిస్తోంది.
Thank you my friend 🙏🏽 🏴☠️
See you soon in Antarctica. ⭐️ @urstrulyMahesh https://t.co/HpBfRPbMEg— PRIYANKA (@priyankachopra) March 1, 2026
Tags : 1