Breaking News

బీడీ తాగడం వల్ల మైగ్రేన్‌తో ఇబ్బందిపడ్డా: మహేశ్‌బాబు

Published on Wed, 01/17/2024 - 09:15

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన లేటెస్ట్‌ మూవీ గుంటూరు కారం. ఇందులో మాస్‌ యాంగిల్‌ కనిపించాడు మహేశ్‌. డైలాగ్స్‌, లుక్స్‌ మాత్రమే కాదు తన చేష్టలు కూడా అలాగే ఉంటాయి. అంతేకాదు పొగ తాగడాన్ని వ్యతిరేకించే ఈ హీరో గుంటూరు కారం సినిమాలో ఎప్పుడూ బీడీ కాలుస్తూ కనిపిస్తుంటాడు. మరి బీడీ, సిగరెట్‌ కాల్చొద్దని నీతులు చెప్పే హీరోనే ఇలా బీడీ తాగుతుంటే అభిమానులు ఫాలో అవరా? అంటారేమో.. తను తాగింది నిజమైన బీడీ కాదట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాని వెనక అసలు సీక్రెట్‌ బయటపెట్టాడు మహేశ్‌.

బీడీ తాగడం వల్ల మైగ్రేన్‌
అతడు మాట్లాడుతూ.. 'నేను సిగరెట్‌, బీడీ తాగను. ఎవరు కూడా దాని జోలికి వెళ్లొద్దనే చెప్తాను. సినిమాలో నేను వాడింది ఆయుర్వేదిక్‌ బీడీ. లవంగం ఆకులతో దాన్ని తయారు చేశారు. సినిమా షూటింగ్‌ మొదలైన తొలినాళ్లలో నాకు నిజమైన బీడీ ఇచ్చారు. కానీ దానివల్ల మైగ్రేన్‌తో ఇబ్బందిపడ్డాను. ఈ బీడీ తాగడం నా వల్ల కావట్లేదని చెప్తే డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ ఆయుర్వేదిక్‌ బీడీని తీసుకొచ్చారు. అందులో పొగాకును వాడలేదు. సినిమా మొత్తం ఆ ఆయుర్వేదిక్‌ బీడీలనే వాడాను' అని చెప్పుకొచ్చాడు.

సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం
కాగా గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.164 కోట్లు రాబట్టి రెండు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. మరోవైపు మహేశ్‌ సంక్రాంతి రోజే చిత్రయూనిట్‌కు సక్సెస్‌ పార్టీ ఇచ్చాడు. హీరోయిన్స్‌ శ్రీలీల, మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, దిల్‌ రాజు ఈ పార్టీకి హాజరయ్యారు.

చదవండి: రజనీ అభిమానులపై ముసలావిడ ఆగ్రహం.. పండగపూట ఇదేం లొల్లి అంటూ!

whatsapp channel

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి