Breaking News

ఎప్పటికీ నీతోనే.. నమ్రతకు మహేశ్‌ లవ్‌ నోట్‌

Published on Mon, 02/10/2025 - 15:08

సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంతమంది మాత్రమే ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మహేశ్‌-నమ్రత జంట ఒకటి. పెళ్లయి ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ జంటపై చిన్న రూమర్‌ కూడా రాలేదంటే.. ఎంత అనోన్యంగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నేడు(ఫిబ్రవరి 10) ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌ 20వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన సతీమణికి సోషల్‌ మీడియా వేదికగా యానివర్సరీ విషెస్‌ తెలియజేశాడు మహేశ్‌. 

‘నువ్వు, నేను.. అందమైన 20 వసంతాలు. ఎప్పటికీ నీతోనే నమ్రత..’ అంటూ నమ్రత, తను కలిసి ఉన్న నవ్వుతున్న ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. మహేశ్‌ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు మహేశ్‌-నమ్రత జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సినిమా కలిపింది
మహేశ్‌ బాబు, నమ్రతలను ఒక్కటి చేసింది ఓ సినిమా. వీరిద్దరు జంటగా వంశీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మనసులు కలిశాయి.  ఓసారి ఈ సినిమా అవుట్‌డోర్‌ షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ న్యూజిలాండ్‌ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్‌ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది.నమ్రత మహేశ్‌ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్‌ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది. 

 న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)