Breaking News

మహేష్‌ బాబు హిట్‌ సినిమా రీరిలీజ్‌ ట్రైలర్‌ వచ్చేసింది

Published on Sat, 04/12/2025 - 17:38

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా రీరిలీజ్‌ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మహేష్ బాబు, భూమిక చావ్లా ప్రధాన పాత్రలో నటించిన ఒక్కడు చిత్రం 2003 సంక్రాంతికి విడుదలై  బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ప్రకాష్‌ రాజ్‌ పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో నటించాడు. అప్పటివరకూ మహేష్ బాబు కెరీర్‌లో రాజకుమారుడు, మురారి లాంటి హిట్లు వచ్చినా మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌గా ఒక్కడు నిలిచింది.

ఒక్కడు సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్‌ రీరిలీజ్‌ తేదీని కూడా ప్రకటించారు. ఏప్రిల్‌ 18న బిగ్‌ స్క్రీన్స్‌పై సినిమా చూడొచ్చని ట్రైలర్‌ ద్వారా ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని విశ్వనాథ్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్స్‌ టికెట్లను ఓపెన్‌ చేశారు. ఒక్కడు సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో ఆయన సతీమణి ఇలా చెప్పారు. మహేష్‌ నటించిన సినిమాల్లో ఒక్కడు క్లాసిక్‌ హిట్‌ అని, ఎక్కువ సార్లు చూసే చిత్రమని తెలిపారు. అంతేగాక తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అని పేర్కొన్నారు. ఈ సినిమా తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్‌గా విడుదలైంది. తమిళంలో విజయ్, త్రిష జంటగా గిల్లి పేరుతో రీమేక్ చేసారు. అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)