Breaking News

ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మరో హీరో... మహేశ్‌ బాబు భారీ స్కెచ్‌!

Published on Sat, 06/07/2025 - 15:59

టాలీవుడ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసానికి, మంచితనానికి కేరాఫ్‌గా నిలిచారు సూపర్‌స్టార్ కృష్ణ ఈ ప్యామిలీ నుంచి వచ్చిన వాడే.  ఆ తర్వాత కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు(Mahesh Babu) హీరో అయ్యాడు. తనదైన శైలీలో సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో రాబోతున్నాడు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, మహేశ్‌ అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది.

ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా హెల్మ్ చేయనున్నారని తాజా సమాచారం. RX 100 వంటి బ్లాక్‌బస్టర్‌తో తన ప్రతిభను చాటిన అజయ్ భూపతి, ఇటీవల థ్రిల్లర్ "మంగళవరం"తో మళ్ళీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం "మంగళవరం 2" ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, మరో హై-ప్రొఫైల్ లాంచింగ్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నాడు.

ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారని తెలియడంతో చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

జయకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ప్రొఫెషనల్ నటనా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల ద్వారా అతని లుక్ పై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌ను జయకృష్ణ బాబాయి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంచి లాంచ్ కోసం అవసరమైన నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలపై మహేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)