Breaking News

ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు

Published on Tue, 03/05/2024 - 14:16

సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరో ఐదేళ్ల బయట ఎక్కడా కనిపించడు. గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ మాట తెగ వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలో రాజమౌళితో మూవీ చేయబోతున్నాడు కాబట్టి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అందుకే తగ్గట్లే మహేశ్.. షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్, రాజమౌళితో మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నన్ను ప్రభావితం చేసి నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు మురారి,పోకిరి,శ్రీమంతుడు. ఈ మూవీస్.. నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. ఈ మూడింటిలానే ఆడియెన్స్‌కి నచ్చేలా, నైతిక అంశాలు ఉండేలాంటి కథల్ని ఎంపిక చేసకుంటూ వస్తున్నాను. అయితే ఇన్నేళ్ల ప్రయాణంలో సినిమా సక్సెస్ కావడంపై నా ఆలోచన విధాం కూడా మారింది. ఓ మూవీ హిట్ కావడానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది కూడా అంతే ముఖ్యం'

(ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్)

'సినిమాలో కనిపించే ప్రతి పాత్రకు నెగిటివ్ ఛాయలు ఉంటాయి. కాబట్టి ప్రతి పాత్ర ఏదో ఓ నైతిక విషయాన్ని అంతర్లీనంగా చెబుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేను ఓ సినిమాని అంగీకరించిన తర్వాత ఆ పాత్రకు లొంగిపోతాతను.  దర్శకుడు చెప్పినట్లు ఆ పాత్ర చేసుకుంటూ వెళ్లిపోతాను. ఆ పాత్రకు గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ.. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులు.. ఏది తప్పో ఒప్పో గుర్తించేంత పరిణతి సాధించారని అనుకుంటున్నారు. అలానే రాజమౌళి సర్‌తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మహేశ్ చెప్పుకొచ్చాడు.

ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడు. కానీ సినిమా పూర్తిగా తేలిపోయింది. ఏ దశలోనూ అలరించలేకపోయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ అందరూ కూడా రాజమౌళితో మూవీపైనే గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. జంగిల్ అడ్వంచర్ స్టోరీతో తీస‍్తున్న ఈ మూవీ కోసం మహేశ్ దాదాపు మూడేళ్ల కేటాయించినట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి