Breaking News

బ్రహ్మానందం కోసం మహేష్‌ బాబు ఏం చేశారంటే..?

Published on Fri, 06/30/2023 - 07:28

 తెలుగు సినీ ప్రపంచంలో హాస్యనటుడు బ్రహ్మానందానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన హాస్యం వల్ల హిట్‌ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన.. తెరపై కనిపించినప్పుడల్లా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అలా  గిన్నిస్‌బుక్‌ రికార్డును కూడా కైవసం చేసుకున్న లెజండరీ కమెడియన్‌ ఆయన. బ్రహ్మానందం స్క్రీన్‌పై కనిపిస్తే, ఎవరైనా నవ్వడం అనేది కామన్‌ పాయింట్‌.  బ్రహ్మీతో టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

(ఇదీ చదవండి: భారత్‌లో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో దిగాడు)

అలాంటి వాటిలో బ్రహ్మానందం-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో అంటే వెరీ స్పెషల్‌. త్రివిక్రమ్ నుంచి వచ్చిన చాలా​ సినిమాల్లో బ్రహ్మానందం కనిపించి సందడి చేశారు. ముఖ్యంగా మహేష్‌బాబు సూపర్‌ హిట్‌ సినిమా 'అతడు'లో బ్రహ్మనందం చేసిన కామెడీ సీన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాత్రకు సంబంధించిన మీమ్స్ వాడుతూనే ఉంటారు.  బ్రహ్మానందం-త్రివిక్రమ్ కాంబో  నుంచి వచ్చిన  ఖలేజా, జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా అదే రేంజ్‌లో మెప్పిస్తాయి. కానీ 'అరవింద సమేత, అఆ, అజ్ఞాతవాసి'  చిత్రాలలో బ్రహ్మీ కనిపించలేదు. వారి కాంబినేషన్‌లో వచ్చే సినిమాలు ఎవరికైనా ఇప్పటికీ అలా చూస్తూ చూడాలనిపిస్తుంది. 

(ఇదీ చదవండి: ఆస్కార్‌లో కొత్త రూల్‌.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ)

తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే..   'గుంటూరు కారం' సినిమాలో బ్రహ్మానందం సందడి చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో మళ్లీ ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందట. కానీ ఈ స్క్రిప్ట్‌లో​ మార్పులు చేసి బ్రహ్మీకి ఓ పాత్ర క్రియేట్​ చేయాలని ప్రిన్స్‌ మహేష్‌ సూచించారట. దీంతో త్రివిక్రమ్ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట. బ్రహ్మీ కోసం ఆడియన్స్‌ను మెప్పించే ఓ పాత్రను డిజైన్ చేశారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.  దీంతో మహేష్‌ ఫ్యాన్స్‌ కూడా గుంటూరు కారంతో పాటు గుంటూరు కామెడీ కూడా ఉంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)