Breaking News

గుంటూరు కారం ఫస్ట్‌ సాంగ్.. మహేశ్‌ ఫ్యాన్స్‌కు మసాల బిర్యానీ రెడీ

Published on Sun, 11/05/2023 - 11:53

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు అభిమానుల జాతర నేటి నుంచి మొదలైంది. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో వచ్చింది. నిజానికి ఈ ప్రోమో ముందే లీక్ అయింది. కొన్ని సెకెండ్ల బిట్ బయటకు వచ్చేసింది. అఫీషియల్‌గా విడుదలైన సాంగ్‌ ప్రోమోను వింటే మహేశ్‌ ఫ్యాన్స్‌కు డబుల్‌ మసాలా బిర్యానీనే అనేలా ఉంది. తమన్‌-త్రివిక్రమ్‌ కాంబోలో మ్యూజిక్‌ ఎలా ఉటుందో ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దిరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌ సెన్సేషన్‌ అని తెలిసిందే.

(ఇదీ చదవండి:  బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌.. టేస్టీ తేజకు రిటర్న్‌ గిఫ్ట్‌.. సందీప్‌ పోస్ట్‌ వైరల్‌)

'ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..' అంటూ మొదలైన సాంగ్​లో.. బిరియానీ, మసాలా లాంటి మాస్ పదాలు ఉన్నాయి. అయితే ఇది జస్ట్​ ట్రాక్ బీట్ మాత్రమే.. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్‌ నవంబర్‌ 7న విడుదల కానుంది. ప్రోమో కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నా తమన్‌ మ్యూజిక్‌ దుమ్ములేపాడు అని చెప్పవచ్చు. మంచి మసాలా బిర్యానీ తింటూ సాంగ్‌ను ఎంజాయ్‌ చేయవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. 

ఇటీవల చాలా సినిమాల నుంచి థమన్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్, పాటలు తరచు విమర్శలతో పాటు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఇలాంటివి ఏమీ తమన్‌ లెక్కచేయడు. నిజానికి తన వ్యవహారధోరణి, తత్వాన్ని బట్టి ఆలోచిస్తే తన మీద సోషల్‌ మీడియాలో ఏదో ప్రచారం జరిగితే డిస్టర్బ్ అయ్యే కేరక్టర్ కాదు…  సోషల్ మీడియా తీరూతెన్నూ మొత్తం తెలిసినవాడే… అవసరమైతే సోవాట్ అని తేలికగా తీసుకోగలడు. గుంటూరు కారంతో ట్రోలర్స్‌కు ఎలాంటి ఛాన్స్‌ ఇవ్వలేదని తెలుస్తోంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)