Breaking News

'బంగారు కళ్ల బుచ్చమ్మో.. కోపంలో ఎంత ముద్దమ్మో'.. సితార వీడియో వైరల్

Published on Sun, 01/15/2023 - 16:33

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులందరూ పండుగ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక పండుగంటే సినీ తారలు చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఫెస్టివల్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గారాల పట్టి సితార గురించి తెలుగు అభిమానులకు పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఇటీవల న్యూ ఇయర్‌ సెలబ్రేషన్ స్విట్జర్లాండ్‌లో జరుపుకున్న ఫోటోలను పంచుకుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది సితార. పట్టు వస్త్రాలు ధరించి అచ్చం తెలుగుమ్మాయి అనేలా ఓ వీడియోను షేర్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ వీడియోలో మహేశ్ బాబు నటించిన మురారి సినిమాలోని 'బంగారు కళ్ల బుచ్చమ్మో.. కోపంలో ఎంత ముద్దమ్మో' అంటూ సాగే సాంగ్‌కు నృత్యం చేస్తూ కనిపించింది. 'ఈ ఆనంద సమయంలో గాలిపటాలు ఎగరనివ్వండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఎరుపు డ్రెస్‌లో సితార తెలుగువారి సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ వీడియోకు మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ కామెంట్ చేసింది. ' నా చిట్టి దేవత. నీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా' అంటూ రిప్లై ఇచ్చింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)