Breaking News

'గుంటూరు కారం' కొత్త పోస్టర్.. ఫ్యాన్స్‌కి నచ్చిందా?

Published on Wed, 08/09/2023 - 07:55

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్నాడు. బుధవారం ఇతడి పుట్టినరోజు సందర్భంగా క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో లుంగీ లుక్, నోటిలో బీడీతో మహేశ్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే అభిమానులు మాత్రం ఓ విషయంలో బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

గందరగోళం?
మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబో అంటే వేరే లెవల్ క్రేజ్. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి 'అతడు', 'ఖలేజా' చిత్రాలు చేశారు. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. టీవీ, యూట్యూబ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్. వాటికి కోట్లాదిమంది ఫ్యాన్స్. ఈ క్రమంలోనే హ్యాట‍్రిక్ సినిమా అనేసరికి ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. కానీ జరుగుతున్నది మాత్రం వేరు. అప్డేట్స్ సరిగా ఇవ్వట్లేదు. ఏం జరుగుతుందో ఫ్యాన్స్‌కి అస్సలు అర్థం కావట్లేదు. అంతా గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: మహేశ్‌ - నమ్రత లవ్ మ్యారేజ్.. మొదట ప్రపోజ్‌ చేసింది ఎవరంటే..!)

రిలీజ్ డేట్ మార్పు?
మహేశ్ చేస్తున్న ఈ సినిమాకు 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి సినిమాని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రిలీజ్ తేదీ మారింది. జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. మరి ఈసారైనా చెప్పిన డేట్‌కి వస్తుందా లేదా అని చూడాలి.

హీరోయిన్ల ఛేంజ్?
దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టారు. తొలుత పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. కారణం ఏంటో తెలీదు గానీ పూజ, ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసింది. సెకండ్ హీరోయిన్ శ్రీలీల మెయిన్ లీడ్ అయింది. హీరోయిన్ మీనాక్షి చౌదరి కొత్తగా వచ్చి చేరింది. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ తప్పుకొన్నారని రూమర్స్ వచ్చాయి. అలానే తమన్‌ని కూడా తప్పించారని మాట్లాడుకున్నారు. కానీ ఇది రూమర్ మాత్రమే అనే తేలింది. మహేశ్ పుట్టినరోజున ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి, వాళ్లని డిసప్పాయింట్ చేశారు.

(ఇదీ చదవండి: సౌత్‌ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్‌ చేయలేని రికార్డ్‌ మహేష్‌ సొంతం)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)