Breaking News

మిస్‌ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Thu, 09/29/2022 - 09:21

నానమ్మను తలుచుకుంటూ సితార సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ అయ్యింది. నిన్న(సెప్టెంబర్‌ 28) సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది.  అయితే నానమ్మను తలుచుకుంటూ సితార ఆమె పార్థివదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం అందరిని కలిచి వేసింది. కూతురు ఏడుస్తుంటే తండ్రి మహేశ్‌ ఆమెను ఓదార్చిన సన్నివేశం అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించారు.

చదవండి: నానమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సితార

అనంతరం ఆమెను తలుచుకుంటూ మహేశ్‌, ఆయన భార్య నమ్రత శిరొద్కర్‌, సితారలు సోషల్‌ మీడియా వేదికగాఎమోషనల్‌ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వారు భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేశారు. ముఖ్యంగా సితార షేర్‌ చేసిన పోస్ట్‌ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది. ‘మిస్‌ యూ సో మచ్‌ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ నానమ్మ, అన్న గౌతమ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది సితార. దీనికి హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని జత చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక ఇది చూసి ‘నానమ్మ అంటే సితూ పాపలకు ఎంత ఇష్టమో’, ‘ఈ పోస్ట్‌తో సితార తన నానమ్మతో ఉన్న అనుబంధం తెలుస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఏ స్పెషల్‌ అకేషన్‌ ఉన్న సితార, గౌతమ్‌లు నానమ్మతో కలిసి సరదా సమయాన్ని గడిపేవారనే విషయం తెలిసిందే. 

Videos

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు

Photos

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)