Breaking News

మహావతార్‌ నరసింహ అద్భుతాలు.. సెట్స్‌పైకి పరశురామ్‌

Published on Mon, 08/18/2025 - 17:13

మహావతార్‌ నరసింహ.. వెండితెరపై ఇప్పటికీ అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది.  ప్రమోషన్లు లేవు, హైప్‌ లేదు, బడ్జెట్‌ కూడా తక్కువే.. అందులోనూ భారీ సినిమాలతో పోటీ.. అన్నింటినీ తట్టుకుని నిలబడింది. యానిమేషన్‌ మూవీ అయినా రికార్డులు భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది. జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ గతవారం క్రితమే రూ.200 కోట్ల మైలురాయిని దాటేసింది. హరిహర వీరమల్లు, కింగ్డమ్‌ చిత్రాల పోటీని తట్టుకుని బలంగా నిలబడింది.

నవంబర్‌లో సెట్స్‌పైకి
ఇటీవలే రిలీజైన వార్‌ 2, కూలీ సినిమాల కాంపిటీషన్‌ను సైతం తట్టుకుని ఇంకా వెండితెరపై మ్యాజిక్‌ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రదర్శకుడు తన నెక్స్ట్‌ మూవీని ప్రకటించాడు. మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (MCU)లో శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా సినిమాలు తెరకెక్కనున్నాయని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే! అందులో భాగంగా తన రెండో సినిమా మహావతార్‌ పరశురామ్‌ను నవంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్తున్నట్లు ప్రకటించాడు. 

నాకంటూ క్లారిటీ ఉంది
వ్యవస్థ తప్పుదారిలో వెళ్తున్నప్పుడు దాన్ని సరిదిద్దేందుకు నిలబడ్డ హీరో పరశురామ్‌. ఇది చాలా శక్తివంతమైన కథ. ఇప్పటికే ప్రీప్రొడక్షన్‌ కూడా మొదలైంది. నరసింహ సినిమా సక్సెస్‌తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజల ప్రేమను చూస్తుంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలనిపిస్తోంది. నాపై ఒత్తిడి ఉంది. కాకపోతే ఇంకా ఏడు సినిమాలు తీయాలన్న క్లారిటీ కూడా ఉంది. అయితే అన్నీ యానిమేషన్స్‌ తీయాలనుకోవడం లేదు. కనీసం రెండు చిత్రాలైనా లైవ్‌ యాక్షన్‌ ఫిలింస్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

పరశురామ్‌పై రెండు సినిమాలు
ఇదిలా ఉంటే పరశురామ జీవితకథపై హిందీలో మహావతార్‌ టైటిల్‌ పేరిట ఓ సినిమా తెరకెక్కుతోంది. ఛావాతో ప్రేక్షకుల్ని మెప్పించిన విక్కీ కౌశల్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్‌మస్‌కు రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. మరి ఈ రెండు పరశురామ్‌ చిత్రాల్లో ఏది బాక్సాఫీస్‌ వద్ద నెగ్గుతుందో చూడాలి!

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)