Breaking News

చైనాలో 'మహారాజా' రెండు రోజుల కలెక్షన్స్‌.. భారీ రికార్డ్‌

Published on Sun, 12/01/2024 - 13:17

భారతీయ సినిమాలు  చైనాలో కూడా ఎక్కువ బిజినెస్‌ చేస్తున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విజయ​ సేతుపతి నటించిన మహారాజా చిత్రం కూడా చైనాలో సత్తా చాటుతుంది. నవంబర్‌ 29న సుమారు 40 వేలకు పైగా థీయేటర్స్‌లలో ఈ చిత్రం విడుదలైంది. కరోనా తర్వాత చైనాలో విడుదలైన భారతీయన సినిమాలలో మహారాజా మాత్రమే అక్కడ రానిస్తుంది. మహారాజా చైనా రోజువారీ బాక్స్ ఆఫీస్ ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో నిలిచింది.

చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. చైనాలోని ప్రముఖ చలనచిత్ర సమీక్ష వెబ్‌సైట్‌లలో ఒకటైన డౌబన్‌లో మహారాజా సినిమాకు 8.7/10 రేటింగ్‌ను ఇచ్చింది. ఇటీవలి కాలంలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిందని అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే, ఫైనల్‌గా చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

'మహారాజ' చిత్రాన్ని నితిలన్‌ సామినాథన్‌ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో దుమ్మురేపుతుంది.

 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)