Breaking News

'మహారాజ' విజయం.. డైరెక్టర్‌కు లగ్జరీ కారు.. ఎవరిచ్చారో తెలుసా..?

Published on Mon, 10/07/2024 - 11:38

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి  నటించిన మహారాజ సినిమా రీసెంట్‌గా 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో చెన్నైలో సెలబ్రేషన్స్‌ జరిగాయి. జూన్‌ 14న విడుదలైన ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్‌ తెరకెక్కించారు.  బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించింది. సినిమా విజయం పట్ల మేకర్స్‌ ఫుల్‌ ఖుషి అయ్యారు.

మహారాజా చిత్రాన్ని ది రూట్, థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్‌ సేతుపతి 50వ చిత్రంగా కోలీవుడ్‌లో విడుదలైంది. రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 110 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో చిత్ర నిర్మాతలు 100 డేస్‌ ఫంక్షన్‌ జరిపారు. ఈ క్రమంలో దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్‌కు నిర్మాతలు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. బీఎండబ్ల్యూ కారును విజయ్‌ సేతుపతి చేతుల మీదుగా  గిఫ్ట్‌గా అందించారు. 

ఇదీ చదవండి: బెయిల్‌ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులు

ఈ క్రమంలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. నిథిలన్‌ స్వామినాథన్‌ మేకింగ్‌, రైటింగ్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమాకు ఇంతటి గుర్తింపు రావడం వెనుక నిథిలన్‌ శ్రమ ఎక్కువుగా ఉందని కొనియాడారు. ఈ సినిమా చూసిన వారందరూ కూడా తనను ఎంతోమంది ప్రశంసించారని విజయ్‌ సేతుపతి గుర్తుచేసుకున్నారు. టీమ్‌ సహకారంతోనే మహారాజ సినిమా విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.

తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఒక తండ్రి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో అనే కథను దర్శకుడు చాలా ఆసక్తిగా చెప్పాడు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే మహారాజ చిత్రంలో విజయ్‌ సేతుపతితో పాటు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ప్రతినాయకుడిగా కనిపించారు. మమతా మోహన్‌దాస్‌, అభిరామి, దివ్య భారతి కీలకపాత్రలలో మెప్పించారు. నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)