Breaking News

జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్‌కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే!

Published on Sat, 01/25/2025 - 16:33

జీవితంపై విరక్తి చెందినవారు, ఆధ్యాత్మిక మార్గంలోనే జీవితాన్ని కొనసాగించాలనుకునేవారు సన్యాసం బాట పడుతుంటారు. ఒకప్పటి గ్లామర్‌ హీరోయిన్‌ మమతా కులకర్ణి (Mamta Kulkarni) కూడా అదే దారిలోకి వెళ్లాలని ఆశపడింది. ఇందుకోసం రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం పుచ్చుకుంది.

సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్‌
కిన్నారా అఖాడా(ఆశ్రమం)లో ఆచార్య మహా మండలేశ్వర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసిగా మారింది. ఇకపై సాధ్విగా తన ప్రయాగం సాగుతుందన్న ఆమె తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది. ఈ వ్యవహారంపై ట్రాన్స్‌జెండర్‌, జగద్గురు మహామండలేశ్వర్‌ హిమాంగి సఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమను మహామండలేశ్వర్‌గా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. 

ఏం చెప్పాలనుకుంటున్నారు?
హిమాంగి సఖి మాట్లాడుతూ.. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే మహామండలేశ్వర్‌గా మారింది. తన గతమేంటో అందరికీ తెలుసు. డ్రగ్స్‌ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చింది. సడన్‌గా భారత్‌కు రావడం.. మహాకుంభమేళాకు హాజరవడం.. ఏకంగా సన్యాసిగా మారిపోవడం ఏంటో.. దీనిపై కచ్చితంగా విచారణ జరపాలి. అలాంటి వ్యక్తికి మహామండలేశ్వర్‌ హోదా ఇచ్చి సనాతన ధర్మానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అర్హత లేని మనిషికి గురువు హోదా ఎందుకిచ్చారు? ఇది అనైతికం అని మండిపడింది.

(చదవండి: మోనాలిసా.. ఆంటీలతో పోలిక.. ఎంత అన్యాయమన్న విశ్వక్‌సేన్‌)

ఎవరీ మమతా కులకర్ణి?
1990'sలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది మమతా కులకర్ణి. షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ వంటి పెద్ద పెద్ద హీరోల సరసన కథానాయికగా యాక్ట్‌ చేసింది. కరణ్‌ అర్జున్‌, బాజీ, ఆషిఖ్‌ ఆవారా, దిల్‌బర్‌, కిస్మత్‌, జానే జిగర్‌ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్‌ మూవీస్‌తో మెప్పించింది. 2003లో ఓ బెంగాలీ సినిమా చేసిన అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించలేదు.

వివాదం
మమతా 2016లో ప్రియుడితో కలిసి డ్రగ్స్‌ వ్యవహారంలో పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్‌ రాకెట్‌ కేసులో ఇరుక్కుంది. ఏళ్ల తరబడి విచారణ జరిపిన బాంబే హైకోర్టు గతేడాది ఆగస్టులో మమతకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అప్పట్లో టాప్‌లెస్‌ ఫోటోషూట్‌తోనూ వివాదాల్లోకెక్కింది.

చదవండి: మాఫియా డాన్‌తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)