Breaking News

హీరోగా మగధీర విలన్.. టీజర్‌ రిలీజ్‌ చేసిన రాజమౌళి!

Published on Thu, 06/20/2024 - 21:16

రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం మగధీర, రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ‍అయితే ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో దేవ్‌గిల్‌ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 

'ఇది అసుర రాజ్యం.. ఇక్కడికీ ఎవడైనా రావడమే తప్ప.. ప్రాణాలతో తిరిగిపోవడం ఉండదు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన ఈ టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ  చిత్రంలో దేవ్‌ గిల్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 'పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వేటాడే వేటగాడు' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచుతోంది. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడనేది కథ. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)