Breaking News

స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!

Published on Wed, 08/30/2023 - 18:12

స్టార్ హీరోకు- నిర్మాతకు మధ్య ఓ వివాదం. ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లింది. గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన దీనిపై తాజాగా న్యాయాస్థానం తీర్పు ఇచ్చింది. సదరు హీరో.. దాదాపు కోటి రూపాయల మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలా హీరో ఎవరు?

జరిగింది ఇదే
తమిళ నటుడు శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అప్పట్లో 'వల్లభ, 'మన్మథ' లాంటి డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత కేవలం తమిళం వరకే పరిమితయ్యాడు. ఇతడు కొన్నేళ్ల ముందు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా కోసం రూ.9.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.4.5 కోట్ల అందుకున్నాడు. కోటి రూపాయలు బ్యాంక్ ద్వారా చెల్లించగా, మిగిలిన మొత్తం డబ్బుగా ఇచ్చారు.

(ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?)

ఎందుకు గొడవ?
అయితే అడ్వాన్స్ తీసుకున్న శింబు.. సినిమా చేసే విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో వేల్స్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఇరువురి వాదనలు విన్న మద్రాసు హైకోర్టు..  బ్యాంక్ ద్వారా చెల్లించిన కోటి రూపాయల్ని నిర్మాణ సంస్థకు తిరిగిచ్చేయాలని ఆదేశించింది. మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలకు సరైన ఆధారాలు లేని కారణంగా అవి తిరిగివ్వాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. 

క్లారిటీ మిస్
ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ.. శింబు సన్నిహితులు లేదా పీఆర్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి ఏమైనా వెళ్తారా? రాజీ కుదుర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యే 'పాతు తలా' మూవీతో వచ్చిన శింబు హిట్ కొట్టాడు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)