Breaking News

కంగనా రనౌత్‌కు కోర్టు నోటీసులు.. 'ఎమర్జెన్సీ' వాయిదా తప్పదా..?

Published on Mon, 09/02/2024 - 19:06

బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు తాజాగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయంలో నోటీసులు జారీ అయ్యాయి. ఈ సినిమాలో  కొన్ని సన్నివేశాలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఆమెతో పాటు  కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎమర్జెన్సీ చిత్రాన్ని తెరకెక్కించిన మణికర్ణిక ఫిల్మ్స్‌తో పాటు సెన్సార్‌ బోర్డు, జీ స్టూడియోస్, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకుంటున్నారని ఇప్పటికే కంగనా రనౌత్‌ పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా కోర్టు నోటీసులతో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ సినిమా విషయంలో 24 గంటల్లోపు స్పందించాలని వారందరికీ నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా తెరకెక్కింది. సెప్టెంబరు 6న విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో కంగనా రనౌత్‌కు అడ్డంకులు ఎదురౌతున్నాయి. అయితే, ఈ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)