Breaking News

సడన్‌గా ఆ సీన్‌లో నటించమన్నారు.. ఇష్టం లేకుండానే..: మధుబాల

Published on Sat, 06/14/2025 - 13:55

రోజా సినిమాతో మధుబాల (Madhoo/ Madhubala) క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ హీరోయిన్‌ కెరీర్‌ తొలినాళ్లలో తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది. ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని భీష్మించుకుని కూర్చుంది. కానీ ఓ సినిమా కోసం దాన్ని బ్రేక్‌ చేయాల్సి వచ్చిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మధుబాల మాట్లాడుతూ.. నేను పెరిగిన వాతావరణం వల్ల ఆన్‌స్క్రీన్‌లో కొన్ని సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బందిగా అనిపించేది. 

సడన్‌గా ఆ సీన్‌లో..
ఆయా సీన్లలో నటించలేక సినిమాలు వదిలేసుకున్న సందర్భాలెన్నో..! అయితే ఓ సినిమా చేస్తున్న సమయంలో ముద్దు సన్నివేశంలో నటించాలన్నారు. దీనిగురించి నాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. షూటింగ్‌కు ముందు ఒక్కమాటైనా చెప్పలేదేంటి? అని నిలదీశాను. అప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్లి.. ఈ సీన్‌ అవసరం.. అందుకే చేయమంటున్నాం అని బతిమాలారు. 

అసలు ఆ సీన్‌ అవసరమే లేదు
ఇష్టం లేకపోయినా ఆ సన్నివేశంలో నటించాను. దాన్ని సినిమాలో ఉంచకూడదని దర్శకుడిని నేనడగలేదు. వాళ్ల ఇష్టానికే వదిలేశాను. తీరా ఆ సీన్‌కు ఎటువంటి ప్రాధాన్యత లేదని పక్కన పెట్టేశారు. అప్పుడు నాది చాలా చిన్నవయసు. కానీ, ఈ రోజుల్లో 22 ఏళ్ల అమ్మాయి కూడా చాలా తెలివిగా ఉంటున్నారు. ఏ సీన్‌కైనా రెడీ అని సాహసం చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే మధుబాల నటించిన కన్నప్ప జూన్‌ 27న విడుదల కానుంది.

చదవండి: పాకిస్తాన్‌లో 'దంగల్‌' ఎందుకు రిలీజ్‌ చేయలేదో చెప్పిన ఆమిర్‌ ఖాన్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)