Breaking News

ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల

Published on Fri, 07/07/2023 - 13:04

'రోజా' సినిమా హీరోయిన్ మధుబాల ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 9-10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. సడన్‌గా నటించడం మానేసి పెళ్లి చేసుకుంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అప్పట్లో అసలు మధుబాల ఎందుకలా చేసిందా అని ఫ్యాన్స్ బుర్ర పీక్కున్నారు. కానీ ఇన్నేళ్లపాటు ఆ విషయం రహస్యంగానే ఉండిపోయింది. మధుబాల ప్రస్తుతం మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఆమె నటించిన 'స్వీట్ కారం కాఫీ' వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఈ ప్రమోషన్‌లోనే మాట్లాడుతూ.. అప్పట్లో తను ఇండస్ట్రీ వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది.

అమ్మ పాత్రకు నో
1991లో మధుబాల హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'పూల్ ఔర్ కాంఠే' సినిమాతో బాలీవుడ్ లోకి  ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అజయ్ దేవగణ్ కు హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత 'రోజా', 'అల్లరి ప్రియుడు', 'జెంటిల్‌మేన్' లాంటి సినిమాలతో అటు హిందీ ఇటు దక్షిణాది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. ఒకానొక సందర్భంలో ఈమెకు బాలీవుడ్ లో ఓ సినిమాలో అమ్మ రోల్ ఆఫర్ చేశారు. అది కూడా హీరో అజయ్ దేవగణ్‌కు. దీంతో సింపుల్ గా నో చెప్పేసింది. కొన్నాళ్లకు నటన, ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకుంది.

(ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ)

బాలీవుడ్‌లో అప్పట్లో
దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన దాని గురించి తాజాగా ఓ ఈవెంట్ లో మధుబాల బయటపెట్టింది. 'నాకు అజయ్ దేవగణ్ తల్లిగా చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. ఇద్దరిదీ ఒకటే వయసు. అయినాసరే నాకు ఎక్కువ వయసున్న రోల్స్ ఆఫర్ చేశారు. నాకు నచ్చలేదు. బాలీవుడ్ లో 90వ దశకంలో పరిస్థితులు దారుణంగా ఉండేవి. హీరోలు యాక్షన్ చేస్తుంటే, హీరోయిన్లకు మాత్రం డ్యాన్స్, రొమాంటిక్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ఉండేవి. నాకేమో డ్యాన్స్ చేయాలని ఉండేది. 'రోజా' తర్వాత అలాంటి పాత్రలు రాలేదు'

ఇండస్ట్రీని వదిలేశా
'అయితే 9-10 ఏళ్లపాటు సినిమాల‍్లో నటించిన చేసిన తర్వాత ఇండస్ట్రీని వదిలేయాలనిపించింది. కారణం కోసం వెతికితే పెళ్లి కనిపించింది. దీంతో ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లకు లెటర్స్ రాశాను.  ఇకపై సినిమాల్లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాను. ఇప్పుడు అదంతా ఆలోచిస్తుంటే.. పిల్లతనంతో చేసిన పనిలా అనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ కాస్త మారింది. సీనియర్స్ కూడా హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆనందంగా ఉంది' అని మధుబాల చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'సలార్' డైరెక్టర్‌‌ని ఓ విషయంలో పక్కా మెచ్చుకోవాలి!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)