Breaking News

మాధవన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో శివానీ రాజశేఖర్‌.. 'జి.డి. నాయుడు'పై సినిమా

Published on Fri, 04/04/2025 - 09:48

ఆర్‌. మాధవన్‌(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్‌’ అనే టైటిల్‌ను ఇప్పటికే  ఖరారు చేశారు. భారత ప్రముఖ ఇంజనీరు జి.డి. నాయుడు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రాజశేఖర్‌, జీవితల కుమార్తె కూడా నటిస్తున్నారు. ‘ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియా, మిరాకిల్‌ మేన్, వెల్త్‌ క్రియేటర్‌ ఆఫ్‌ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) షార్ట్‌గా జి. డి. నాయుడు అని కూడా అంటారు. ఇప్పుడు ఆయన  జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్‌’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్‌కు కృష్ణకుమార్‌ రామకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా టైటిల్‌ లోగోను మేకర్స్‌ ఇప్పటికే రిలీజ్‌ చేశారు. ప్రియమణి, జయరాం, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లుగా మేకర్స్‌ వెల్లడించారు.

జీడీ నాయుడు బయోపిక్‌లో టాలీవుడ్‌ హీరోయిన్‌ శివానీ రాజశేఖర్‌ కూడా నటించనుంది. ఇందులో మాధవన్‌తో పాటుగా బిగ్‌ స్క్రీన్‌పై ఆమె కనిపించనున్నారు. త్వరలో ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్తుండటంతో ఏర్పాట్లు స్పీడ్‌గా చేస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన జి.డి నాయుడు కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ,  ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్‌టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్‌లో కొన్ని పరికరాల ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్‌ ఫీల్డ్‌లో విప్లవం సృష్టించారని చెప్పవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి  ఎలక్ట్రిక్‌ మోటార్‌ను రూపొందించింది ఆయనే కావడం విశేషం. అందుకే ఆయన్ను ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు. 1893లో జన్మించిన ఆయన 1974లో మరణించారు.  

ఈ మధ్యకాలంలో మాధవన్‌ నటిస్తున్న రెండో బయోపిక్‌ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్‌ కూడా చేసి మెప్పించారు మాధవన్‌. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్‌లో మాధవన్‌ నటిస్తుండటం విశేషం. మరి... వెండితెరపై మిరాకిల్‌ మేన్‌గా మాధవన్‌ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)