Breaking News

త్వరలో తండ్రి కాబోతున్న బిగ్‌బాస్‌ మానస్‌

Published on Thu, 07/04/2024 - 17:48

బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటుడు మానస్‌ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు వెల్లడించాడు. భార్య శ్రీజ ప్రస్తుతం గర్భిణి అన్న విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా మా మనసులు పర్ఫెక్ట్‌గా కలిశాయి. ఇప్పుడు మా కుటుంబంలోకి ఓ బుజ్జాయి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. బేబీ నాగులపల్లి వచ్చేస్తున్నాడు అంటూ శ్రీజ బేబీ బంప్‌ ఫోటో షేర్‌ చేశాడు. 

వారం రోజుల క్రితమే శ్రీజకు ఘనంగా సీమంతం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఇకపోతే గతేడాది నవంబర్‌లో చెన్నైకి చెందిన శ్రీజను మానస్‌ పెళ్లి చేసుకున్నాడు. నెల తిరిగేలోపు కొత్త కారు కూడా కొన్నాడు. ఇప్పుడు ఏడాది తిరగకముందే శ్రీజ గర్భం దాల్చిందన్న గుడ్‌ న్యూస్‌ చెప్పాడు.

కాగా మానస్‌.. కాయ్‌ రాజా కాయ్‌, ప్రేమికుడు తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొని టాప్‌ 5 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచాడు. బ్రహ్మముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

 

 

చదవండి: 23 కిలోలు తగ్గా.. అప్పటినుంచే ఎక్కువ ఆఫర్లు: బాలీవుడ్‌ నటి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)