Breaking News

దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు

Published on Fri, 03/17/2023 - 15:15

సినీ నటుల జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వారి జీవితంలో ఒడుదొడుకులు రావడం సహజం. ఇక కొందరి జీవితాలు మరీ దుర్భరమైన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పాకీజా.  ఆమె దీన స్థితిని చూసిన టాలీవుడ్ హీరోలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సాయం చేయగా.. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు.

అసెంబ్లీ రౌడీ చిత్రంలో ఆమె పాత్రకు బాగా గుర్తింపు వచ్చింది.  బ్రహ్మనందంతో కలిసి ఆమె చేసిన కామెడీకి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. చాలా సినిమాల్లో ఆర్టిస్ట్‌గా రాణించిన ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెంటనే పాకీజాకి లక్షరూపాయలు అందించి మరోసారి మంచి మనసును చాటుకున్నారు.

ఆ తర్వాత ఆమె విషయం తెలుసుకున్న మోహన్ బాబు.. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తాను అమెరికాలో ఉన్నానని ఇండియా రాగానే సాయం చేస్తానని మాట ఇచ్చినట్లుగా పాకీజా తెలిపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డును ఆమెకు అందించనున్నాడు.

 ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మా అసోసియేషన్ కార్డుకు గతంలో రూ.లక్ష రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 90 వేలకు తగ్గించారు. మా అసోసియేషన్‌కు కట్టాల్సిన రూ.90 వేల రూపాయలను మంచు విష్ణు చెల్లించి పాకీజాకు కార్డు ఇస్తారంటూ కల్యాణి వెల్లడించింది. దీంతో ఆమె కుటుంబానికి మా అసోసియేషన్ ద్వారా లభించే అన్నింటికీ అర్హత దక్కుతుందని తెలిపింది. 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)