Breaking News

ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్‌ బాబు, విష్ణు

Published on Thu, 10/14/2021 - 12:09

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ముగిసినప్పటికీ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొందిన వారంతా రాజీనామా చేయడంతో కొత్త చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి  ఎన్నికైన మంచు విష్ణు ఈ మూకుమ్మడి రాజీనామాలపై ఎలా స్పందిస్తాడా! అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో.. విష్ణు మాత్రం కూల్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. బుధవారం అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం పెన్షన్‌ ఫైల్‌పై సంతకం చేశాడు. ఇక తర్వాత ఏం జరగనుంది.. ఎవరూ ఎలా స్పందిస్తారోనని వేచి చూస్తుండగా ఆసక్తిగా మంచు విష్ణు తన తండ్రి మోహన్‌ బాబుతో కలిసి ఈ రోజు నందమూరి బాలకృష్ణతో భేటీ అయ్యాడు.

చదవండి: చిరంజీవిపై నరేశ్‌ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు

ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై బాలయ్యతో చర్చించినట్లు సమాచారం. ‘మా’ అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం అనంతరం విష్ణు మొదటి సారిగా బాలకృష్ణను కలవడం చర్చకు దారి తీసింది. భేటీ అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చానని స్పష్టం చేశాడు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవిని కలుస్తానని కూడా చెప్పాడు. ఈ నెల 16న ఎన్నికల అధికారి తన ప్యానల్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పాడు. ఇక రాజీనామాలపై ఈసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని విష్ణు పేర్కొన్నాడు. అనంతరం మోహన్‌ బాబు కూడా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో విష్ణుకు బాలకృష్ణ అండగా నిలిచారని, ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చామని తెలిపాడు. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)