‘శరచ్చంద్రికా తేజయామిని..’ చాలా మందికి అర్థం కాలేదు

Published on Sat, 01/10/2026 - 14:54

‘‘నేను లిరిసిస్ట్‌గా 2012లో కెరీర్‌ స్టార్ట్‌ చేస్తే, అప్పట్నుంచి నంది అవార్డులు లేవు. మన ప్రతిభకు అవార్డులు కొలమానం కాదని భావిస్తాను. ఒకవేళ అవార్డ్స్‌ వస్తే అవి బోనస్‌’’ అని చెప్పారు ప్రముఖ గీత రచయిత కేకే (కృష్ణకాంత్‌). నేడు (శనివారం) కేకే పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘2025లో నేను పాటలు రాసిన 22 చిత్రాల నుంచి 45 పాటలు విడుదలయ్యాయి. 

2025లో నాకు చాలెంజింగ్‌గా అనిపించిన పాట ‘ది రాజాసాబ్‌’ సినిమాలోని ‘సహనా సహనా’. ఇక ఎన్టీఆర్‌–హృతిక్‌ రోషన్‌గార్లు కలిసి డ్యాన్స్‌ చేసిన ‘సలామ్‌ అనాలి’ (‘వార్‌ 2’ సినిమా) పాట రాయడం సంతోషంగా అనిపించింది. రజనీకాంత్‌గారి ‘కూలీ’ సినిమాలోని ‘మౌనిక’ పాట తెలుగు వెర్షన్‌ రాశాను. విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ సినిమాలోని అన్ని పాటలు రాశాను. ‘మిరాయ్‌’ చిత్రంలోని ‘వైబ్‌ ఉంది’ సాంగ్‌ యూట్యూబ్‌లో 130 మిలియన్‌ వ్యూస్‌ వరకు వెళ్లింది. ప్రభాస్, నాని, శ్రీవిష్ణుగార్లు నన్ను నమ్మి అవకాశం కల్పిస్తున్నారు. 

నేను ప్రభాస్‌గారి అభిమానిని. కెరీర్‌ ఆరంభంలో ఆయన సినిమాలకు పాటలు రాస్తే బాగుండు అనుకునేవాడిని. ఇప్పుడు ప్రభాస్‌గారి వరుస చిత్రాలకు (సాహో, రాధేశ్యామ్, సలార్, ఫౌజి) పాటలు రాయడం హ్యాపీ. ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘ఫౌజి’, ఎన్టీఆర్‌గారి ‘ఎన్టీఆర్‌ నీల్‌’, విజయ్‌ సేతుపతి ‘పూరీ సేతుపతి’ సినిమాలతో పాటు చాలా సినిమాలకు పాటలు రాస్తున్నాను’’ అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా పాటల్లో ఇంగ్లిష్‌ పదాలు తక్కువగానే ఉంటాయి. ‘ది రాజాసాబ్‌’లో ‘శరచ్చంద్రికా తేజయామిని..’ పాట రాశాను. చాలామందికి ఈ పదాలు అర్థం కాలేదు. అర్థం కాలేదని తెలుగు రాయకుండాపోతే మన భాషను మర్చిపోతాం. అయితే ట్రెండ్‌నూ ఫాలో అవుతాను’’ అని చెప్పారు. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)