ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్
Breaking News
ఈ మధ్య నేను విన్న పాటల్లో చాలా అరుదైన పాట అదే : చంద్రబోస్
Published on Thu, 12/29/2022 - 17:03
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మురళి కిషోర్ అబ్బురు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ "వాసవసుహాస" పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాటపై ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ ప్రశంసలు కురిపించారు.
''నేను ఈ మధ్య విన్న పాటల్లో చాలా చాలా అరుదైన,విలువైన పాట.వినగానే ఆశ్చర్యానందానికి లోనైన పాట..వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలోని వాసవ సుహాస గీతం.రాయడానికి ఎంత ప్రతిభ ఉండాలో దాన్ని ఒప్పుకోడానికి అంత అభిరుచి, భాషా సంస్కరం వుండాలి. కవి కళ్యాణ్ చక్రవర్తి గారికి హృదయపూర్వక ఆశంసలు'' అంటూ చంద్రబోస్ అభినందించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
Tags : 1