లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రివ్యూ

Published on Fri, 04/04/2025 - 17:21

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ చాన్నాళ్ల తర్వాత నటుడిగా చేసిన సినిమా 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్). కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి సంయక్తంగా నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకుడు. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించారు. తాజాగా  ఏప్రిల్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?

కథేంటి?
కిశోర్(ఎస్పీ చరణ్), సిద్ధూ (శ్రీ హర్ష) తండ్రీ కొడుకులు. అనాథలకు ఆపదొస్తే సాయం చేయడంలో మిగతావారి కంటే మందుంటారు. అనాథ శవాలకు సొంత డబ్బుతో కిశోర్ దహన సంస్కారాలు జరిపిస్తుంటాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం గుర్రపు పందెలు కాస్తుంటాడు. ప్రతిసారి ఇతడే బెట్ నెగ్గుతుంటాడు. 

అయితే కిశోర్ చేసే అనాథ శవాల దహన సంస్కారాల వెనుక పెద్ద స్కామ్ ఉందని వార్తలొస్తాయి. దీని వెనుక బడా బిజినెస్ మ్యాన్ కబీర్ (నవాబ్ షా) ఉంటాడు. కిషోర్, సిద్ధూను ఇతడు ఎందుకు టార్గెట్ చేశాడు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో మైథాలజికల్ అంశాలు చూపిస్తున్నారు. 'లవ్ యువర్ ఫాదర్' కూడా ఆ లిస్టులోకి వచ్చే సినిమా.  కథలో ఇదే మేజర్ పార్ట్. దాన్ని డామినేట్ చేసేలా ఎక్కువ స్క్రీన్ టైమ్ కాలేజీ ఎపిసోడ్ తీసుకోవడంతో ఇంటర్వెల్ ముందు అసలు కథలో కీలకమైన ఘట్టం మొదలు అవుతుంది. సెకండాఫ్ కూడా ఫాంటసీ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఫ్లోని కొంత డైవర్ట్ చేసినా నవ్విస్తాయి. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. 

రెగ్యులర్ అన్పించే కామెడీ సీన్స్, కాలేజీ ఎపిసోడ్స్ తర్వాత వచ్చే డివోషనల్ సీన్స్ హై ఇస్తాయి. మధ్య మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నా అందర్నీ మెప్పించే డివోషనల్ పాయింట్ కోసం పర్లేదు. క‌థ‌లో కీల‌క‌మైన రివేంజ్ ఎపిసోడ్ ఇంకాస్త బ‌లంగా రాసుకుంటే బాగుండేది. క‌థ‌లో బ‌ల‌వంతంగా ఇరికించిన ఫీలింగ్ క‌లుగుతుంది.

మణిశర్మ సంగీతమందించిన శివుని నేపథ్యంలో పాట, నేపథ్య సంగీతం బాగున్నాయి. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు స్థాయికి తగ్గటున్నాయి. డైలాగ్స్ మీద వర్క్ సరిగా చేయలేదు. కామెడీపై కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.

తండ్రిగా ఎస్పీ చరణ్ నటన బాగుంది. హీరోగా ఫస్ట్ సినిమాకు శ్రీహర్ష డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ కషికా కపూర్ ఓకే. మిగతా పాత్రధారులు న్యాయం చేశారు. కొంత ల్యాగ్, రొటీన్ సీన్స్ ఉన్నా డివోషనల్ పాయింట్, క్లైమాక్స్ ట్విస్ట్ పర్లేదనిపించేలా ఉన్నాయి.

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)