Breaking News

ఓటీటీలో 'లక్కీ భాస్కర్'.. అధికారిక ప్రకటన

Published on Mon, 11/25/2024 - 12:29

దీపావళి సందర్భంగా  'లక్కీ భాస్కర్' సినిమాతో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ఆయన ఈసారి లక్కీ భాస్కర్‌తో అక్టోబర్‌ 31న థియేటర్స్‌లోకి వచ్చేశాడు. సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి టాలీవుడ్‌లో తన సత్తా నిరూపించుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

దుల్కర్‪‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం అందుకున్న ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. నవంబర్‌ 28 నుంచి లక్కీ భాస్కర్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది. 

కథేంటి?
ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు