Breaking News

లక్కీ అలి కన్సర్ట్‌.. సంగీతప్రియులూ.. రెడీయా?

Published on Fri, 03/03/2023 - 19:57

ప్రముఖ సంగీతకారుడు లక్కీ అలీ హైదరాబాద్‌లో రేపు(మార్చి 4న) తన ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈయన పాడిన ‘ఓ సనమ్‌’, ‘ఏక్‌ పల్‌ కే  జీనా’ ; ‘న తుమ్‌ జానో న హమ్‌’ సహా మరెన్నో పాటలు సంగీతాభిమానుల మదిలో చిరస్ధాయిగా నిలిచిపోయాయి. శనివారం నాడు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వద్ద సంగీతాభివమానులను ఆలరించనున్నారు లక్కీ అలి. ‘‘నిరీక్షణ ముగిసింది ! ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న కన్సర్ట్‌ చివరకు హైదరాబాద్‌లో హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ (ఫెయిర్‌పార్క్‌) వద్ద జరుగనుంది. లక్కీ మెలోడియస్‌ ట్యూన్స్‌లో లీనం కావడానికి సిద్ధం కండి, హైదరాబాద్‌లో మరుపురాని రాత్రులను సొంతం చేసుకోండి’’అని  ఈ కార్యక్రమ నిర్వాహకులు సౌండ్స్‌వర్త్‌ వెల్లడించారు.

లక్కీ అలీ సంగీతాభిమానుల ఆరాధ్య గాయకులలో ఒకరు. యన 1996లో తన  తొలి ఆల్బమ్‌ ‘సునో’ విడుదల చేశారు. అది ఇన్‌స్టెంట్‌ హిట్‌ కావడంతో పాటు పలు అవార్డులు ఆయన్ను వరించాయి. వీటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంటీవీ ఆసియా వ్యూయర్స్‌ ఛాయిస్‌ అవార్డు కూడా ఉంది. ఆయన పాడిన పాటలలో చాలా వరకూ ఇప్పటికీ సంగీతాభిమానులకు ప్రీతిపాత్రంగా వెలుగొందుతున్నాయి. లక్కీ అలీ విడుదల చేసిన ఇతర ఆల్బమ్‌లలో  సిఫార్‌, అక్స్‌, స్యుయీ వంటివి ఉన్నాయి. అవి కూడా  అభిమానులు, విమర్శల ప్రశంసలు పొందాయి.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)