బన్నీ గడప ముందు బడా డైరెక్టర్లు.. చాన్స్‌ ఎవరికి?

Published on Sat, 11/29/2025 - 11:57

పుష్ప, పుష్ప 2 చిత్రాలలో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. అంతకు ముందు వరకు సౌత్‌ ఇండస్ట్రీకే పరిచయం ఉన్న బన్నీ..పుష్ప చిత్రంతో నార్త్‌ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్‌ సినిమా అంటే.. బాలీవుడ్‌ సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. బన్నీ కూడా పాన్‌ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోనే కథలను ఎంచుకుంటున్నాడు. తన తదుపరి చిత్రాన్ని అట్లీతో ప్రకటించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాదిలో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బన్నీతో సినిమా చేసేందుకు పలువురు బడా డైరెక్టర్లు లైన్‌లో ఉన్నారు.

అందులో ముందు వరుసలో ఉన్నది త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. పుష్ప 2 చిత్రం తర్వాత బన్నీ.. త్రివిక్రమ్‌తోనే సినిమా చేయాల్సి ఉంది. నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే అల్లు అర్జున్‌(Allu Arjun) సడెన్‌గా అట్లీ వైపు మొగ్గు చూపాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ అదే కథతో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడనే పుకార్లు వచ్చాయి కానీ..దీనిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్‌ ఆ కథను బన్నీతో చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నాడట. మరోవైపు యానిమల్‌ తర్వాత సందీప్‌ రెడ్డి ప్రభాస్‌తో సినిమా ప్రకటించాడు. అదే సమయంలో అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం అట్లీ సినిమాతో బన్నీ.. ప్రభాస్‌ స్పిరిట్‌ చిత్రంలో సందీప్‌ బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే మూవీకి కాస్త టైం పట్టే అవకాశం ఉంది.

అయితే త్రివిక్రమ్‌, సందీప్‌తో పాటు తాజాగా మరో దర్శకుడి పేరు కూడా బన్నీ ఖాతాలో చేరింది. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌(Lokesh kanagaraj) కూడా అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటికే లోకేష్‌ కనగరాజన్‌ బన్నీకి కథ వినిపించాడట. వీరిద్దరి కాంబినేషన్‌ దాదాపు సెట్‌ అయినట్లేనని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.  వీరితో పాటు ప్రశాంత్‌ నీల్‌, సంజయ్‌ లీలీ భన్సాలీ కూడా బన్నీ కోసం కథలను సిద్ధం చేసుకున్నారట. మరి వీరిలో బన్నీ ఎవరికి చాన్స్‌ ఇస్తారనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.

ప్రస్తుతం బన్నీ తన ఫోకస్‌ అంతా అట్లీ సినిమాపైనే పెడుతున్నాడు. రూ.700 కోట్ల బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్‌ పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని సమాచారం. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వినియోగంతోపాటు... విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)