Breaking News

రజనీకాంత్‌గారిని విలన్‌గా చూపించాలనుకున్నా!: దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌

Published on Fri, 07/25/2025 - 03:27

రజనీకాంత్‌ను ఓ పవర్‌ఫుల్‌ విలన్‌గా చూపించే ప్రయత్నం మిస్‌ అయ్యిందని అంటున్నారు తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘కూలీ’. నాగార్జున, శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్‌ షాహిర్‌  ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘కూలీ’ సినిమా ప్రయాణం గురించి లోకేశ్‌ కనగరాజ్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘‘కూలీ’ సినిమా కంటే ముందు రజనీకాంత్‌గారికి ఓ పెద్ద కథ చెప్పాలనుకున్నాను. అందులో రజనీకాంత్‌గారిది విలన్‌ పాత్ర. మిగతా లీడ్‌ రోల్స్‌ హీరో పాత్రల మాదిరిగా ఉంటాయి. అయితే ఈ సినిమా నేను చేయడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. రజనీకాంత్‌గారు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నా సినిమా కోసం ఆయన రెండు సంవత్సరాల కాలాన్ని వృథా చేయడం నాకు ఇష్టం లేదు.

అదే సమయంలో నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. దీంతో ఆ సినిమాను వద్దనుకుని, ‘కూలీ’ సినిమా కథ చెప్పగా, రజనీకాంత్‌ గారు ఓకే చేశారు. అలా ఆయనతో ‘కూలీ’ సినిమా చేయడం జరిగింది. అయితే నా ‘ఎల్‌సీయూ’ (లోకేశ్‌  కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌)లో ‘కూలీ’ భాగం కాదు. అలాగే ‘కూలీ’ సినిమాలో ఓ మంచి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంది. ఈ సినిమా ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని లోకేశ్‌ కనగరాజ్‌ చెప్పుకొచ్చారు. ఇక ‘కూలీ’ సినిమా తర్వాత లోకేశ్‌  డైరెక్షన్‌లో ‘ఖైదీ 2’ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఆమిర్‌ ఖాన్‌తో ఓ సూపర్‌ హీరో మూవీ చేస్తారు లోకేశ్‌. ఇంకా కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌ 2’, సూర్యతో ‘రోలెక్స్‌’ వంటి సినిమాలు లైనప్‌లో ఉన్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు లోకేశ్‌.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)