Breaking News

లోకేష్‌ కనగరాజ్‌, లారెన్స్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన

Published on Sun, 04/14/2024 - 18:11

 కోలీవుడ్‌లో వరుస హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు లోకేష్‌ కనగరాజ్‌.. ఆయన నుంచి సినిమా ప్రకటన వచ్చిందంటే చాలు భారీగా అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలో  ఖైదీ, విక్రమ్‌, మాస్టర్‌ లాంటి సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద ట్రెండ్‌ క్రియేట్ చేసి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో సినిమా ఛాన్స్‌ దక్కించుకున్నాడు.

తాజాగా లోకేష్‌ కనగరాజ్‌ కొత్త సినిమాను ప్రకటించాడు. దానికి టైటిల్‌ కూడా 'బెంజ్‌' అని ఫిక్స్‌ చేశాడు. అందులో రాఘవ లారెన్స్‌ హీరోగా నటుస్తున్నాడు. అయితే ఈ క్రేజీ సినిమాను లోకేష్‌ డైరెక్ట్‌ చేయడం లేదు. కేవలం కథను మాత్రమే అందిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని బక్యరాజ్‌ కన్నన్‌ (రెమో) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ ఉండదట.. లోకేష్‌ డైరెక్ట్‌ చేసిన ఖైదీ సినిమాలో కూడా హీరోయిన్‌ పాత్ర ఉండదు అనే విషయం తెలిసిందే.

రాఘవ లారెన్స్‌ నుంచి మరో సినిమా ప్రకటన కూడా తాజాగా వెలువడింది. హంటర్‌ అనే టైటిల్‌తో ఒక పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. కోలీవుడ్‌లో కత్తి సినిమాను డైరెక్ట్‌ చేసిన వెంకట్‌ మోహన్‌ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. కత్తి సినిమా తెలుగులో ఖైదీ 150 పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. హంటర్‌ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)