Breaking News

భారీ రెమ్యునరేషన్‌ తీసుకునే టాప్‌ 10 లేడీ సింగర్స్‌ వీళ్లే!

Published on Thu, 06/19/2025 - 13:45

సంగీత ప్రపంచంలో గాయణీమణులకు ప్రత్యేక స్థానం ఉంది. తమ అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది ప్రేమను పొందుతున్న లేడీ సింగర్స్‌ చాలా మందే ఉన్నారు. వారు ఆలపించే సినిమా పాటలకు యూట్యూబ్‌లో కోట్లల్లో వ్యూస్‌ వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో  ‘గాన కోకిల’లకు మంచి డిమాండ్‌ ఉంది. మేల్‌ సింగర్స్‌ కంటే వాళ్లే ఎక్కువ సంపాదించే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారు.  బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు లైవ్ కాన్సర్ట్‌లు, ఈవెంట్‌ల ద్వారా  భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న లేడీ సింగర్స్‌పై ఓ లుక్కేద్దాం.

1. శ్రేయా ఘోషాల్: 
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీ శ్రేయా ఘోషాల్‌. ఈమె  ఒక్కో పాటకు సుమారు రూ. 25-27 లక్షలు, లైవ్ కాన్సర్ట్‌లకు రూ. 40-45 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. 'బర్సో రే', 'దేవసేనా' వంటి పాటలతో ఆమె అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. సూసేకీ..(పుష్ప 2), హైలోస్సో..(తండేల్‌), నానా హైరానా..(గేమ్‌ ఛేంజర్‌) లాంటి అద్భుతమైన పాటలను ఆలపించి.. తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది.

Sunidhi Chauhan Birthday: Five iconic tracks that highlight the singer's  explosive vocals

2. సునిధి చౌహాన్
సునిధి ఒక్కో పాటకు రూ. 20-25 లక్షలు, కాన్సర్ట్‌లకు రూ. 25-30 లక్షలు ఛార్జ్ చేస్తారట. నాలుగేళ్ల వయసులోనే ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'ఢూమ్ మచాలే', 'బీడీ జలైలే' వంటి పాటలతో  బాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు.ఇప్పటి వరకు ఆమె 10 భాషల్లో 2500 వరకు పాటలను పాడారు. ఓయ్‌ సినిమాలో ఆమె ఆలపించిన ‘సరదాగా చందమామనే..’ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఆ పాట చాలా మంది వింటుంటారు.

3. కనికా కపూర్‌ 
బేబీ డాల్‌, చిట్టియక్కలాయాన్‌, టుకుర్‌ టుకుర్‌, జెండా ఫూల్‌ పాటలతో పాటు పుష్ప సినిమాలోని  ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో జనాలను ఉర్రూతలూగించిన ఈ అందాల గాయని ఒక్కో పాటకు 18-22 లక్షలు తీసుకుంటుందట. ఆమె ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల వరకు ఉంటుదని సమాచారం.

4. నేహా కక్కర్‌
యూత్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న సింగర్‌ నేహా కక్కర్‌. ఆమె ఒక్కో పాటకు రూ. 10-15 లక్షలు, ఈవెంట్‌లకు రూ. 25-30 లక్షలు తీసుకుంటారు. 'మైల్ హో తుమ్', 'గర్మీ' వంటి హిట్ డ్యాన్స్ నంబర్స్‌తో ఆమె ట్రెండ్‌సెట్టర్‌గా మారారు.

5. అల్కా యాగ్నిక్: 
90లో బాలీవుడ్ హిట్‌ల రాణి అల్కా ఒక్కో పాటకు రూ. 12 లక్షలు, కాన్సర్ట్‌లకు రూ. 15-20 లక్షలు తీసుకుంటారు. 'ఏక్ దో తీన్', 'చోలీ కే పీఛే' వంటి పాటలతో ఆమె లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు

6. నీతి మోహన్‌
బాలీవుడ్‌ ప్రముఖ సింగర్స్‌లో నీతి మోహన్‌ ఒకరు. ఆమె ఒక్కో పాటకు 8-10 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటుంది.

7. తులసి కుమార్
మెలోడీ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన తులసి ఒక్కో పాటకు రూ. 5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 8-10 లక్షలు తీసుకుంటారు. 'తుమ్ జో ఆయే', 'లవ్ హో గయా' వంటి పాటలతో ఆమె అభిమానులను సంపాదించారు.

8. ఆషా భోస్లే
దిగ్గజ గాయనీమణి ఆషా ఒక్కో పాటకు రూ.5-8 లక్షలు, ఈవెంట్‌లకు రూ. 10-15 లక్షలు ఛార్జ్ చేస్తారు. 'దమ్ మారో దమ్', 'పియా తు అబ్ తో ఆజా' వంటి ఐకానిక్ పాటలతో ఆమె మంచి గుర్తింపు పొందింది.

9. శిల్పారావు
తనగాత్రంతో బాలీవుడ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుటున్న తెలుగమ్మాయి శిల్పారావు ఒక్కో పాటకు 5-10 లక్షల వరకు తీసుకుంటుంది. దేవర సినిమాలో ‘చుట్టమల్లే..’, జైలర్ లో కావాలయ్యా అనే పాట పాడింది ఈ సింగరే.

10. మోనాలీ ఠాకూర్
బహుముఖ ప్రతిభ కలిగిన మోనాలీ ఒక్కో పాటకు రూ.5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 15 లక్షల వరకు తీసుకుంటారు. 'జరా జరా టచ్ మీ', 'సావర్‌లూన్' వంటి పాటలతో ఆమె గుర్తింపు పొందారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)