Breaking News

సీరియల్ షూటింగ్‌లో చిరుతపులి బీభత్సం!

Published on Thu, 07/27/2023 - 13:15

సినిమా లేదా సీరియల్ షూటింగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని సమకూర్చుకుని స్టూడియోల్లో షూటింగ్ చేస్తుంటారు. హైదరాబాద్‌లో చాలాచోట్ల ఇలానే జరుగుతుంటాయి. ముంబయిలో మాత్రం చిత్రీకరణలో పాల్గొంటున్న యాక్టర్స్ తెగ భయపడిపోతున్నారు. దానికి కారణం.. సెట్‌లోకి పాములు, కొండచిలువ, చిరుతల్లాంటివి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడూ అలాంటి సంఘటనే జరిగింది.

(ఇదీ చదవండి: 'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!)

ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో చిరుతపులి బీభత్సం సృష్టించింది. 'సుఖ్ మాంజే కాయ్ ఆస్తా' అనే మరాఠీ సీరియల్ షూటింగ్ మంగళవారం జరుగుతుండగా, సాయంత్రం 4 గంటల టైంలో చిరుతపులి సెట్‌లోకి వచ్చింది. చిన్న చిరుత పిల్లతో కలిసి అటు ఇటు తిరుగుతూ యాక్టర్స్‌తో పాటు మిగతా అందరినీ భయపెట్టింది. దీంతో అక్కడున్న దాదాపు 200 మంది ప్రాణభయంతో పరుగెత్తారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా మీడియాకు చెప్పారు. 

గత 10 రోజుల్లో ఇలా చిరుతలు సెట్ లోకి రావడం ఇది నాలుగోసారి అని సురేష్ శ్యామ్ లాల్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఈయన ఇదే విషయాన్ని చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడు జరిగిన సంఘటనతో అర్థమవుతోంది. గతంలో ఇలానే 'అజుని' సీరియల్ షూటింగ్ జరుగుతుండగా చిరుతపులి వచ్చింది, 'గుమ్ హై కిసీ కే ప్యార్ మే' షో జరుగుతుండగా ఏకంగా కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇలా వరస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ బెదిరిపోతున్నారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)