Breaking News

రికార్డులు కొల్లగొడుతున్న లియో.. కమల్, రజినీ చిత్రాలను వెనక్కినెట్టి!

Published on Wed, 10/25/2023 - 12:31

కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్- దళపతి విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం లియో. ఈనెల 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్‌ వచ్చినా కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరనుంది.  కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ జీవితకాల కలెక్షన్స్‌ను కేవలం ఐదు రోజుల్లోనే లియో అధిగమించింది. కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. 

(ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్‌: బుల్లితెర నటి)

అయితే కలెక్షన్ల పరంగా ఇండియాలో ఆరు రోజుల్లో దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఆరో రోజు రూ.31.50 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ జోరు ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల మార్క్‌ను దాటేయనుంది. వసూళ్లపరంగా రజినీకాంత్ నటించిన రోబో 2.0 పేరిట ఉన్న రికార్డ్‌ను సైతం లియో బద్దలు కొట్టింది.

గతంలో ఆరు రోజుల్లో రోబో 2.0 రూ. 400 కోట్లు వసూలు చేస్తే.. లియో కేవలం ఐదు రోజుల్లోనే ఆ మార్కును చేరుకుంది. ఈ వారంలోనే లియో ఐదొందల కోట్ల మార్క్ చేరుకుంటే రోబో 2.0, జైలర్‌ తర్వాత ఆ లిస్ట్‌లో మూడో చిత్రంగా లియో నిలుస్తుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. 

(ఇది చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)