Breaking News

'లియో' బుకింగ్‌ స్టార్ట్‌.. వార్నింగ్‌ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం

Published on Sat, 10/14/2023 - 08:23

దళపతి విజయ్‌ నటించిన తాజా చిత్రం లియో (సింహం). నటి త్రిష, ప్రియాఆనంద్‌ హీరోయిన్‌లుగా నటించిన ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, దర్శకుడు గౌతమ్‌మీనన్‌, మిష్కిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టార్‌ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో 7స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌కుమార్‌ భారీ ఎత్తున నిర్మించారు.

(ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్‌)

అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. లియో చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్‌ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర వర్గాలు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో విజయ్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సాధారణంగా విజయ్‌ చిత్రం విడుదలవుతుందంటే అభిమానుల హంగామా మాములుగా ఉండదు. ఆలయాల్లో పూజలు, థియేటర్ల వద్ద కటౌట్లకు పాలాభిషేకాలు బాణసంచా మోత మోగుతుంటుంది.

అయితే విజయ్‌ ఆదేశాల మేరకు ఉత్తర చైన్నె అభిమానులు ఇప్పుడు ఎలాంటి హంగామాలు చేయడం లేదంటున్నారు. లేకపోతే చిత్ర విడుదలకు మరో ఆరు రోజులు ఉండగా శుక్రవారం నుంచే చైన్నె, మదురై, కోయంబత్తూర్‌ వంటి ప్రధాన నగరాల్లో చిత్రం అడ్వాన్‌న్స్‌ బుకింగ్‌ ప్రారంభమైనట్టు తెలిసింది. సాధారణంగా రెండు మూడు రోజులముందు అడ్వాన్‌న్స్‌ బుకింగ్‌ ప్రారంభమవుతుంది అలాంటిది ఆరు రోజుల ముందే బుకింగ్‌ మొదలు అన్నది అరుదైన విషయమే అవుతుంది.

లియోకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్‌
తమిళనాడు ప్రభుత్వం లియో సినిమా స్పెషల్ షోలపై ఆంక్షలు విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో విజయ్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. తమిళనాడులో లియో చిత్రం ప్రదర్శనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అముత IAS అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించారు.లియో స్పెషల్ షోలకు ఎలాంటి అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా బెదిరింపులకు దిగి ప్రత్యేక షోలు వేయాలని థియేటర్‌ యాజమాన్యంతో గొడవకు దిగితే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అముత ఆదేశించారు. థియేటర్లలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)