Breaking News

లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!

Published on Tue, 10/17/2023 - 14:52

తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ తాజాగా నటించిన చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ  సినిమా బెనిఫిట్ షోలకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేవలం ఉదయం 9 గంటల తర్వాతే షో వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై లియో మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

(ఇది చదవండి: వివాదంలో ‘లియో’.. మద్దతుగా రజనీకాంత్‌!)

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెష‌ల్ షోలకు అనుమ‌తి నిరాక‌రించింది.  ఉద‌యం 9 గంట‌ల త‌ర్వాతే స్క్రీనింగ్ మొద‌ల‌య్యేలా అనుమ‌తులు ఇచ్చిన‌ట్లు తెలిసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో విజ‌య్ అభిమానులు నిరాశకు గురయ్యారు.  రిలీజ్ మొదటి రోజు లియో స్క్రీనింగ్ త‌మిళం కంటే తెలుగులోనే ముందుగా మొద‌లు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉద‌యం ఐదు గంట‌లు, ఏడు గంట‌ల‌కు సినిమాను ప్రదర్శించనున్నారు.

కాగా.. లియో సినిమాలో సంజ‌య్‌ద‌త్‌, అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా.. లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబ‌ర్ 19న రిలీజ్ కానుంది. 

(ఇది చదవండి: 'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!)


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)