Breaking News

రోజా ‘లెనిన్‌ పాండియన్‌’ మూవీ రివ్యూ

Published on Thu, 10/29/2026 - 12:03

ప్రతి మనిషిలో ఓ తెలియని శక్తి ఉంటుంది. ఆ శక్తికి ఆడ,మగ, జాతిమత, వయస్సులతో సంబంధముండదు. అటువంటి అద్వితీయ శక్తి బయటపడ్డపుడే మనిషి పూర్తి విలువ తెలుస్తుంది. ఆ కోవకు సంబంధించిన కథాంశమే లెనిన్ పాండియన్. ఈ కథ లైన్ చాలా చిన్నదైనా దాని ప్రభావం మాత్రం అనంతం. దానికి అభినందనీయుడు ఈ సినిమా దర్శకుడే. డిడి బాలచంద్రన్ తాను రాసుకున్న కథను తానే తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. దర్శకుడిగా బాలచంద్రన్ కు ఇది మొదటి సినిమా అయినా, ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా స్క్రీన్ ప్లేని రసవత్తరంగా రాసుకున్నాడు. ఎంతలా అంటే ఈ కథలోని పాత్రలతో ప్రేక్షకులు సినిమా మొత్తం కలిసి ప్రయాణిస్తారు. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. 

మరవర్మన్ సుందరపాండ్యన్ కొత్తగా పోలీసు ఉద్యోగంలో చేరతాడు. అయితే తన వయస్సు, శారీరక దృష్ట్యా అందరిలా పోలీసు అని అనిపించుకోలేడు. తండ్రి తదనంతరం వచ్చిన పోలీస్ ఉద్యోగంలో చుట్టూ ఉన్న సహోద్యోగులతోపాటు బయట ఉన్న వారు కూడా పాండ్యన్‌ను హేళనకు గురిచేస్తూ ఉంటారు. మరో పక్క తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో తనకున్న చిన్నపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ ఉంటాడు దురైరాసు. ఆరు పదుల వయస్సున్న దురైరాసుకు మీనాక్షి అనే ఓ మేక, చిన్నపాటి పూరిపాక ఆ పై నలభై ఏళ్ళ సంథానమ్ భార్యగా ఉంటారు. దురైరాసు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా ఇసుక మాఫియా జరుగుతూ ఉంటుంది. 

చదవండి: మళ్లీ వెనక్కి వెళ్లడం ఎందుకు?: కత్రినా

ఈ ఇసుక మాఫియా నడిపేది కరడు గట్టిన నేరస్తులు. ఆ ఇసుక దోపిడీ నేపధ్యంలోనే తాను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మీనాక్షి మేకను కోల్పోతాడు దురైరాసు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన దురైరాసు తన మేకను కోల్పోయినందుకుగాను ఇసుక మాఫియాపై హత్యకేసు పెడతాడు. కేసు విచారణ నేపథ్యంలో దురైరాసుకు సెక్యురిటీగా పాండ్యన్‌ను నియమిస్తుంది కోర్టు. ఇక అక్కడి నుండి కథ ఎన్నో భావోద్వేగాలతో కూడిన మలుపులతో ప్రయాణిస్తుంది. ఓ వైపు నిస్సహాయుడైన దొరైరాసు, మరో వైపు సరైన బలం లేని పాండ్యన్.. వీరిద్దరూ కలిసి హత్యగాబడ్డ మేక హంతకులైన ఇసుక మాఫియాను ఎదిరించగలరా అన్నదే సినిమా.

చదవండి: ఓటీటీకి వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ 'బత్తా'.. ఎలా ఉందంటే?

ఈ సినిమా చూసే ప్రేక్షకులకి వీళ్లా చేసేది, వీళ్ళు చేయగలరా అని ప్రతి క్షణం అనుకున్నా ఆ పాత్రలతో మమేకమవుతారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రధాన పాత్రధారి దురైరాసు పాత్రను పోషించిన గంగై అమరన్ సహజత్వంతో ఆకట్టుకుంటాడు. అలాగే తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతురాలు ప్రముఖ నటి రోజాసెల్వమణి కూడా సంథానమ్ పాత్రలో ఒదిగిపోయారు. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.  మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.

- ఇంటూరు హరికృష్ణ

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)