Breaking News

యముడికి డ్యాన్స్ స్టెప్పులు నేర్పిన కైకాల!

Published on Sat, 07/25/2026 - 09:01

తెలుగు సినీ పరిశ్రమకు ఆయన నవరస నటనా సార్వభౌముడు. వెండితెరపై వందల పాత్రల్లో జీవించి కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన మహానటుడు. కానీ కృష్ణా జిల్లా కౌతవరం ప్రజలకు మాత్రం ఆయన ఇప్పటికీ ‘మన కైకాల’. శనివారం ఆయన జయంతి సందర్భంగా గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్న ఆ ముద్దుబిడ్డ జ్ఞాపకాలివి.

కృష్ణాజిల్లా: తెలుగు సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పోషించిన పాత్రలు కాదు.. ఆ పాత్రలకు ఆయన ఇచ్చిన ప్రాణం. యముడైనా, దుర్యోధనుడైనా, కంసుడైనా, రాజుగానైనా, రైతుగానైనా.. తెరపై కనిపించిన ప్రతిసారి ఆ పాత్రే నిజమైపోయేది. అలాంటి మహానటుడి మూలాలు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం అనే చిన్న గ్రామంలోనే ఉన్నాయి. కైకాల జయంతి సందర్భంగా ఆయన సినీ విజయాల కంటే, ఆయనను తీర్చిదిద్దిన కౌతవరం జ్ఞాపకాలు నేటికీ గ్రామంలో సజీవంగా నిలిచాయి. 

 

కాలినడకన చదువుకున్న బాలుడు.. కోట్లాది అభిమానుల నటుడయ్యాడు 
ప్రాథమిక విద్య కౌతవరంలో పూర్తిచేసిన కైకాల, హైస్కూల్‌ చదువుకోసం ప్రతిరోజూ కాలినడకన గుడ్లవల్లేరు వెళ్లేవారు. అదే పట్టుదల ఆయనను తర్వాత మద్రాసు వరకు తీసుకెళ్లింది. అక్కడ ప్రారంభమైన సినీ ప్రయాణం దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది. 

ప్రతినాయకుడికి కొత్త నిర్వచనం 
విఠలాచార్య పరిచయం చేసిన ప్రతినాయక పాత్రలు కైకాలకు కొత్త గుర్తింపునిచ్చాయి.  ఆయన  విలన్‌గానే కాదు.. హాస్యం, కుటుంబ కథలు, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మక చిత్రాలు.. ఏ పాత్రలోనైనా సహజత్వాన్ని చూపించి ‘నవరస నటనా సార్వభౌముడు’  బిరుదును సార్థకం చేశారు.  

ఎన్టీఆర్‌కు డూప్‌గా.. తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు 
ఎన్టీఆర్ ను పోలిన రూపురేఖల కారణంగా పలు చిత్రాల్లో ఆయనకు డూప్‌గా నటించే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మెట్టుగా చేసుకుని తర్వాత తనదైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. 

సినిమా దాటి.. సొంత ఊరిపై మమకారం 
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కౌతవరాన్ని మరచిపోలేదు. మచిలీపట్నం ఎంపీగా గ్రామంలో ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేశారు. కొత్త ఆస్పత్రి నిర్మాణం, కౌతవరం–చేవెండ్ర రహదారి అభివృద్ధి వంటి పనుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపి గ్రామస్తుల మన్ననలు పొందారు. ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా లిచారు. ప్రతిఒక్కరూ ఆయన్ను గుర్తు చేసుకుంటారు.

మర్రిచెట్టు నీడలో.. 
1935 జూలై 25న కైకాల లక్ష్మీనారాయణ, సీతారావమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ చిన్ననాటి రోజులు సాధారణ గ్రామీణ బాలుడివే. కౌతవరం చెరువు గట్టున ఉన్న మర్రిచెట్టు కింద గంటల తరబడి స్నేహితులతో కబుర్లు చెప్పడం, చెరువులో దొరికే చేపలు ఇష్టంగా తినడం, మంచి బెల్లం–పప్పుచెక్క కోసం మిత్రులతో తిరగడం... ఇవన్నీ ఆయన బాల్యాన్ని గుర్తుచేసే మధురస్మృతులని గ్రామ పెద్దలు ఇప్పటికీ  చెబుతుంటారు.

గ్రామానికి గర్వకారణం.. చిరస్మరణీయం 
కైకాల మరణానంతరం గ్రామస్తులు స్వచ్ఛందంగా ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జయంతి, వర్ధంతి రోజున ఆ విగ్రహం వద్ద నివాళులర్పించడం కౌతవరం ప్రజలకు ఒక ఆనవాయితీగా మారింది. ‘మా ఊరిలో పుట్టి తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మహానటుడు’ అని గ్రామస్తులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)