Breaking News

బాలకృష్ణ కాలు తొక్కా.. ప్యాకప్‌ చెప్పి.. నన్ను వద్దన్నారు: హీరోయిన్‌

Published on Wed, 05/14/2025 - 13:46

లయ(laya)...ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆమె కోసం సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. 1999లో వేణు 'స్వయంవరం' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లయ.. 2006 వరకు దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత  25 ఏళ్ల వయసులోనే గణేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లి పోయింది. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్‌ చేసింది. ఆ తర్వాత డ్యాన్స్‌ స్కూల్‌ కూడా రన్‌ చేసింది. కరోనా కారణంగా అది మూతపడింది. 

ఆ తర్వాత సోషల్‌ మీడియాలోకి వచ్చిన లయ.. ఇన్‌స్టాలో వరుసగా రీల్స్‌ చేయడంతో ఆమె గురించి మరోసారి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆమె చేసిన రీల్స్‌ వల్లే..మళ్లీ సినిమా చాన్స్‌లు వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌ రీఎంట్రీ ఇస్తోంది. నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమాలో లయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్‌ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కితే.. సీరియస్‌ అవ్వడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పాడని, నన్ను ఆటపట్టించడానికే ఇలా అన్నారనే విషయం తెలియక బోరున ఏడ్చానని చెప్పింది.

‘విజయంద్రవర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాను. ఆ సినిమా ఫస్డ్‌డే షూటింగ్‌ రోజే పాట పెట్టారు. దాని కోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఈ క్రమంలో నేను పొరపాటున బాలయ్య కాలు తొక్కేశాను. దాంతో బాలకృష్ణ వెంటనే సీరియస్‌ అయ్యాడు. ‘నా కాలే తొక్కుతావా..? ప్యాకప్‌.. ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి’అని చెప్పి పక్కకి వెళ్లిపోయాడు. 

బాలకృష్ణ అలా అనడం నేను తట్టుకోలేకపోయాను. గట్టిగా ఏడ్చేశాను. వెంటనే బాలయ్య వచ్చి..‘అయ్యో..నేనేదో సరదాగా అన్నాను.. నిజమనుకున్నావా? ఇలాంటివి నేను బోలెడు అంటున్నాను’ అని నవ్వేశాడు. ఆయన జోక్‌ చేశాడనే విషయం గ్రహించక నేను ఏడ్చేశాను. సెట్‌లో ఎప్పుడు ఆయన అలానే సరదాగా ఉండేవాడు’ అని లయ చెప్పుకొచ్చింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)