Breaking News

పౌడర్‌ వేసుకున్నానని.. తిట్టారు: లావణ్య త్రిపాఠి

Published on Wed, 06/11/2025 - 14:35

మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన తొలి తెలుగు సినిమా ‘అందాల రాక్షసి’. హను రాఘవపూడి దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, రాహుల్‌ రవీంద్ర హీరోలుగా నటించారు. వారిద్దరికి కూడా హీరోలుగా ఇదే తొలి సినిమా. 2012లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. సినిమాలోని డైలాగ్స్‌, పాటలు బాగా వైరల్‌ అయ్యాయి. 

అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ క్లాసిక్‌ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుంది. జూన్‌ 13న ఈ చిత్రం రీరిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా లావణ్యతో పాటు చిత్రబృందం అంతా మరోసారి సినిమా కోసం ప్రచారం చేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో సినిమా షూటింగ్‌ నాటి అనుభవాలను పంచుకుంటున్నారు.

 ఈ సందర్భంగా లావణ్య ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకుంది. హీరోలతో పాటు తను కూడా మేకప్‌ లేకుండానే నటించానని చెప్పింది. ఓ సారి అనుకోకుండా ముఖానికి మేకప్‌ వేసుకొని వస్తే.. దర్శకుడు హను రాఘవపూడి తిట్టాడని చెప్పింది. 

‘ఈ సినిమా కోసం నేను ఎలాంటి మేకప్‌ వేసుకోలేదు. రియల్‌ హెయిర్‌తోనే నటించాను. కనీసం పౌడర్‌ కూడా వేసుకోలేదు. ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌లోనే నేను పౌడర్‌ వేసుకొని సెట్‌కి వచ్చాను. దర్శకుడు హను ఫోటో తీసి నా దగ్గరకు వచ్చి జూమ్‌ చేసి చూపించాడు. నీ ముఖంపై పౌడర్‌ పటికలు ఎలా కనిపిస్తున్నాయో చూడు’ అన్నారు. వెంటనే నేను ముఖం కడుక్కొని వచ్చాను’ అంటూ నాటి షూటింగ్‌ అనుభవాలను లావణ్య పంచుకున్నారు. ఇక రాహుల్‌ మాట్లాడుతూ.. జీరో మేకప్‌తో సినిమా చేశాం. కనీసం సన్‌స్క్రీన్‌ కూడా వాడలేదని చెప్పారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు