Breaking News

మరో ఓటీటీలో మెగా కోడలి సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Thu, 05/21/2026 - 15:28

వరుణ్‌ తేజ్‌ సతీమణి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం సతీ లీలావతి. పెళ్లి తర్వాత లావణ్య చేసిన మూవీ ఇదే కావడం విశేషం. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆదరణ లేకపోవడంతో కేవలం 12 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. సన్ నెక్ట్స్ వేదికగా ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ ‍అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ సన్‌ నెక్ట్స్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం రెండు ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ అడియన్స్‌కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ప్రేమ, పెళ్లి, విడాకుల అనే అంశాలతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

సతీ లీలావతి కథేంటంటే..

లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్‌ డైరెక్టర్‌. ఇంట్లో పెరెంట్స్‌ తరచూ గొడవలు పడడంతో చిన్నప్పటి నుంచి ఆమెలో ఓ భయం ఏర్పడుతుంది. ఆ భయం నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్‌ రామ్‌ సేతు(దేవ్‌ మోహన్‌)ని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మారి, నాన్న(నరేశ్‌) అనుమతిలో పెళ్లి కూడా చేసుకుంటుంది. మూడేళ్ల పాటు చక్కగా కాపురం చేసిన రామ్‌.. ఉన్నపళంగా విడాకులు కోరతాడు.

ప్రస్తుతం తాను  నర్స్‌ నికోలా సెబాస్టియన్‌ (మడోన్నా సెబాస్టియన్‌)తో  రిలేషన్‌లో ఉన్నానని.. విడాకులు ఇస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. విడిపోవడం ఇష్టంలేని లీలావతి..భర్తను కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది.  ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సేతు నేపథ్యం ఏంటి? నర్స్‌ నికోల అతని జీవితంలోకి ఎలా వచ్చింది? భర్తను దక్కించుకునేందుకు లీలావతి ఏం చేసింది? లాయర్‌ తమలపాకుల(వీటీవీ గణేష్‌)కు ఆమె చెప్పిన అబద్దం ఏంటి?  ఆమెకు దొంగ(సప్తగిరి), నిర్మాత మొట్ట రాజర్‌(మొట్ట రాజేంద్రన్‌) ఎలాంటి సహాయం చేశారు? చివరకు లీలావతి-రామ్‌సేతు విడాకులు తీసుకున్నారా ? లేదా తిరిగి ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

 

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)